లేడీ ప్రకాష్ రాజ్.. టూమచ్‌గా లేదూ?

లేడీ ప్రకాష్ రాజ్.. టూమచ్‌గా లేదూ?

యాంకర్‌గా అరంగేట్రం చేసి నటిగానూ అవకాశాలు అందుకుంది అనసూయ. ‘క్షణం’తో పాటు ‘రంగస్థలం’ ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అలాగని ఆమె నటిగా పెద్ద రేంజికేమీ వెళ్లిపోలేదు. ఇంకా తొలి అడుగులే వేస్తోంది. ఇంతలోనే ప్రకాష్ రాజ్ స్థాయికి చేరిపోవాలని ఆశపడుతోంది అనసూయ. లేడీ ప్రకాష్ రాజ్ అని జనాలతో అనిపించుకోవాలన్నది తన కోరిక అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

‘‘ఇండస్ట్రీలో నాకు దక్కే ప్రతి పాత్రతోనూ నేనేంటో రుజువు చేసుకోవాలని ఉంది. తెలుగులో లేడీ ప్రకాష్ రాజ్ అనిపించుకోవాలన్నది నా కోరిక. ఆయన విభిన్న పాత్రల్లోకి అలవోకగా ఒదిగిపోతారు. నేను ఒక రోజు ఐటెం సాంగ్ చేయాలి. మరుసటి రోజు ఒక బామ్మగా నటించాలి. ఆ తర్వాతి రోజు హీరోయిన్ పాత్రలో కనిపించాలి. ఇలా విభిన్నమైన పాత్రలతో నటిగా నేనేంటో చూపించాలని ఉంది’’ అంటూ నటిగా తన లక్ష్యమేంటో వివరించింది అనసూయ.

ఐతే ఒకట్రెండు సినిమాల్లో కొంచెం పేరు రాగానే మరీ ఈ స్థాయిలో ఊహించుకోవాలా.. ఇండస్ట్రీ అనసూయకు ఆ రేంజిలో అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తుందా అన్నది సందేహం. తాను ఆషామాషీ పాత్రలేవీ ఒప్పుకోనని అంటున్న అనసూయ.. ప్రస్తుతం ‘సచ్చిందిరా గొర్రె’ సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు చెప్పింది. ఈ చిత్రం 70 శాతం పూర్తయిందని.. ఇందులో తాను మరో ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నానని వెల్లడించింది. ఇందులో శ్రీనివాసరెడ్డి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English