‘రంగస్థలం’ దెబ్బకు ఫోన్ స్విచాఫ్

‘రంగస్థలం’ దెబ్బకు ఫోన్ స్విచాఫ్

‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు పాత్రే కాదు.. చాలా క్యారెక్టర్లలో ప్రత్యేకత కనిపిస్తుంది. చిన్న చిన్న పాత్రల విషయంలోనూ సుకుమార్ ముద్ర చూడొచ్చు. ప్రతి క్యారెక్టర్‌నూ అంత శ్రద్ధగా తీర్చిదిద్దాడతను. ఇలా సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రల్లో జబర్దస్త్ మహేష్ పోషించిన క్యారెక్టర్ కూడా ఒకటి. హీరో అసిస్టెంటుగా అతడి పాత్ర.. నటన ప్రత్యేకంగా నిలిచాయి ఈ చిత్రంలో.

ముఖ్యంగా చిట్టిబాబు నానమ్మ గురించి ప్రెసిడెంటు అసిస్టెంటు ఏమని తిట్టాడో చెప్పే సీన్లో.. ఆపై చిట్టిబాబు చనిపోయిన తన అన్నను భుజాన వేసుకుని వచ్చే సన్నివేశంలో మహేష్ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మహేష్ మాట్లాడుతూ తన పాత్రకు.. నటనకు వస్తున్న ప్రశంసల్లో తడిసి ముద్దయిపోతున్నానని.. తనకు ఇలాంటి గుర్తింపు వస్తుందని తాను ఊహించలేదని అన్నాడు.

తన కొత్త ఫోన్ ఫుల్ ఛార్జింగ్ చేసుకున్నా కాసేపటికే ఛార్జింగ్ అయిపోతోందని.. కొన్ని రోజులుగా తాను ఆ స్థాయిలో కాల్స్ మాట్లాడుతున్నానని.. తన పాత్రకు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదని అతనన్నాడు. తన తండ్రి చనిపోయాడని.. తల్లి తాను సినిమాల్లోకి వెళ్లడంపై చాలా భయపడుతుండేదని.. కానీ ఇప్పుడు తనకు వస్తున్న గుర్తింపు చూసి అమితానందం చెందుతోందని అతనన్నాడు.

జగపతిబాబు సహా ఎంతోమంది ఫోన్ చేసి తనను అభినందించారని అతను చెప్పాడు. స్నేహితులు తనను చూసి గర్విస్తున్నట్లు చెప్పారన్నాడు. దీనికంతటికి సుకుమారే కారణమని.. ఎవరు పొగుడుతున్నా తనకు కళ్ల ముందు సుకుమారే కనిపిస్తున్నాడని మహేష్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English