తాప్సీ ఆఖరి ఆశలు దానిపైనే

తాప్సీ ఆఖరి ఆశలు దానిపైనే

ఇకే తన ఆఖరి ప్రయత్నమని చెప్పేసింది డిల్లీ భామ తాప్సీ. ఇప్పటివరకు తెలుగు చిత్రసీమలో డజనుకు పైగా సినిమాలు చేసిన  తాప్సీ, ఒక్కటంటే ఒక్క హిట్టుకూడా కొట్టకపోవడం గమనార్హం. అయితే ఇదే విషయం మన అందాల సుందరి దగ్గర ప్రస్తావిస్తే, అవును నిజమే కేవలం లక్‌ వలనే ఇన్ని సినిమాలు చేస్తున్నాను అంటూ నిజం ఒప్పేసుకుంది.

ఇప్పుడు ప్రస్తుతం అమ్మడు చేతిలో ఉన్నది కేవలం 'సాహసం' సినిమా ఒక్కటే. ఇక ఈ సినిమా కూడా తేడాపడిందంటే తెలుగులో ఎవ్వరూ సినిమాలు ఇవ్వరని మెంటల్‌గా ప్రిపేరయ్యింది తాప్సీ. పైగా ఇప్పటికే ఒక్క నిర్మాత కూడా తనకి కాల్‌ చేయడంలేదని ఉన్న మాట చెప్పేసింది. ఈ లెక్కను చూస్తే తాప్సీ తన కెరియర్‌కు ఒక టర్నింగ్‌ పాయింట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తోందనమాట.

ఈ తరుణంలో హీరో గోపిచంద్‌, క్రియేటివ్‌ దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి సాహసం సినిమాను ఏ రేంజ్‌లో తీర్చిదిద్దుంటారో అనే ఆసక్తి కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా హిట్టయ్యి తాప్సీ బ్రేక్‌ రావాలని కోరుకుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు