నాని అండ్ నాగ్ కెమిస్ర్టీ అదిరింది

నాని అండ్ నాగ్ కెమిస్ర్టీ అదిరింది

సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున.. యంగ్ హీరో నాని కలిసి ఓ సినిమా చేస్తున్నారనే సంగతి పాత విషయమే. శ్రీరాం ఆదిత్య ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. హైద్రాబాద్ మెట్రోలో హీరో నాని- హీరోయిన్ రష్మిక మందనలపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది.

కానీ ఈ మల్టీ స్టారర్ లో ఇద్దరూ కలిసి నటించే సన్నివేశాల షూటింగ్ మాత్రం ఇప్పుడే ప్రారంభం అయింది. 'ఇవాళ పొద్దున్నే ఓ చిన్న పిల్లాడి మాదిరిగా విపరీతంగా ఎగ్జయిట్ అయిపోయాను. షూటింగ్ స్పాట్ కి వెళ్లిపోయాను. మొదటిసారి ఇలా వెళుతున్న ఫీల్ కలిగింది. ఎందుకో తెలుసా?'అంటూ ట్వీట్ తో టీజ్ చేశాడు నాని. ఇంతకీ విషయం ఏంటంటే.. నాగార్జునతో కలిసి షూటింగ్ చేయనున్నాడన్న మాట. అదే విషయాన్ని నాగార్జున వెనుక నుంచి కనిపించేలా స్పాట్ నుంచి ఓ పిక్ తీసి పోస్ట్ చేసిన నాని.. వెల్ కం కూడా చెప్పాడు న్యాచురల్ స్టార్. కింగ్ ఇవాల్టి నుంచి షూటింగ్ వస్తున్నారని అన్నాడు. దీనికి నాగార్జున నుంచి థాంక్యూ అంటూ రిప్లై వచ్చింది.

అలా సింపుల్ గా థాంక్యూతో ఆపేస్తే.. ఆయన నాగ్ ఎలా అవుతారు? అందుకే తనను ఎలా నాని ఫోటో తీశాడో.. అలాగే నాని ఫోటోను కూడా తీసి పోస్ట్ చేసిన నాగార్జున 'బోలెడంత ట్యాలెంట్ ఉన్న వ్యక్తితో షూటింగ్ ప్రారంభించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను' అన్నారు నాగార్జున. కుర్ర హీరోకి ఏ మాత్రం తగ్గకుండా నాగ్ రిప్లై ఇచ్చిన విధానం మాత్రం భలేగుంది. ట్విట్టర్లో వీరి కెమిస్ర్టీ అదిరింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు