నితిన్‌కి సారీ చెప్పిన త్రివిక్రమ్‌!

 నితిన్‌కి సారీ చెప్పిన త్రివిక్రమ్‌!

అజ్ఞాతవాసి దెబ్బ నుంచి త్రివిక్రమ్‌ ఇంకా కోలుకున్నట్టు లేడు. తను కథ అందించి, నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న 'ఛల్‌ మోహన్‌ రంగ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి కూడా త్రివిక్రమ్‌ గైర్హాజరు అయ్యాడు. పవన్‌కళ్యాణ్‌ వచ్చినా కానీ త్రివిక్రమ్‌ మాత్రం ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడు. ఆ ఈవెంట్‌ మిస్‌ అయినా త్రివిక్రమ్‌తో వీడియో బైట్‌ తీసుకోవాలని నితిన్‌ చాలా ట్రై చేసాడట.

అయితే తానెప్పుడూ తన సినిమాలకి కూడా ఇలాంటి ప్రచారాలు చేసుకోలేదని, అంచేత ఇలాంటివేమీ పెట్టవద్దని నితిన్‌కి సారీ చెప్పేసాడట. 'గురూజీ' అంత ఖరాఖండీగా చెప్పేసరికి నితిన్‌ కూడా ఇంక అడగలేకపోయాడట. కనీసం పోస్ట్‌ రిలీజ్‌ వేడుకల్లో అయినా పాల్గొంటారేమోనని అడిగితే ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌తో బిజీగా వుంటానని, అంచేత అలాంటివాటికి అటెండ్‌ అవలేనని తేల్చేసాడట.

సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నానని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేసి పంపేసాడట. ఇంతగా త్రివిక్రమ్‌ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ కొట్టిన అజ్ఞాతవాసి మూడ్‌లోంచి ఆయన ఇంకా కోలుకోకపోవడం ఎన్టీఆర్‌ అభిమానుల్ని కలవర పెడుతోంది. ఈ మూడ్‌లో త్రివిక్రమ్‌ ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తాడనే డౌట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో శ్రీను వైట్లకి ఆగడుతో ఎదురుదెబ్బ తగిలినపుడు వరుసపెట్టి చాలా తప్పులు చేసి వెనుకబడిపోయాడు. త్రివిక్రమ్‌ ఈ దెబ్బ నుంచి కోలుకుని ఎన్టీఆర్‌ సినిమాతోనే బౌన్స్‌ బ్యాక్‌ అయితే తెలుగు చిత్ర పరిశ్రమకి అంతకంటే కావాల్సిందేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు