చెయ్యాల్సిన రచ్చ చేసి.. మీకెందుకు అంటే?

చెయ్యాల్సిన రచ్చ చేసి.. మీకెందుకు అంటే?

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తన టార్గెట్ గురించి చాలానే చెబుతోంది కానీ.. జనాల్లో రెగ్యులర్ గా తన పేరు నానాలనే ఉద్దేశ్యం మాత్రం వర్కవుట్ అయినట్లుగానే కనిపిస్తోంది. టాలీవుడ్ లో సెక్స్ స్కాండల్ గురించి ఇప్పుడు చెబుతున్న పేర్లు సెన్సేషన్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా ఈమె కొమ్ములు తిరిగిన శేఖరుడు అంటూ ఓ దర్శకుడిని తిట్టిపోయగా... దానికి శేఖర్ కమ్ముల ఆన్సర్ నుంచి హెచ్చరికలు రావడం తెలిసిందే.

మర్యాదగా క్షమాపణలు చెప్పాలంటే.. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా అన్నాడు శేఖర్ కమ్ముల. అంత పెద్ద దర్శకుడు తనపై రియాక్ట్ కావడంపై.. శ్రీరెడ్డి స్పందించింది. 'ఏంటి.. శేఖర్ కమ్ముల గారు సీరియస్ అయ్యారట. మా లాంటి చిన్నవాళ్ల మీద జులుం ఏంటి సార్.. నేనేదో కల్పితమైన బెడ్ టైం కథలు రాస్తూ ఉంటా నా పేజీలో..  నా ఫ్యాన్స్ కోసం. నా హాబీ. మీరేం ఫీల్ అవకండి. మీరేమీ చెయ్యలేదుగా.. అలాంటప్పుడు ఎందుకో లొల్లి' అంటూ మళ్లీ కమ్ములను గిల్లింది శ్రీరెడ్డి. అయితే ఆ పోస్టును కాసేపటిలోనే డెలీట్ చేసి.. 'ఏం పీక్కుంటావో పీక్కో.. నీ డ్యాన్సులు నా దగ్గర కాదు.. నేను దేవుడ్ని నమ్ముతాను. ఈ కోర్టులో తప్పించుకున్నా ఆ కోర్టులో శిక్ష పడుతుంది' అంటూ కామెంట్ చేసింది.

నిజానికి ఇది వింటేనే ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే అమ్మడు ఇన్నాళ్ళూ అన్నేసి అబాండాలు వేసేసి.. వాటిని బెడ్ టైం స్టోరీలు అని చెప్పి.. ఇప్పుడేమో దేవుడ్ని నమ్ముతాను అనడం ఇంకాస్త విడ్డూరంగా ఉంది. అసలు ఇండస్ర్టీ పరువుపోతుంది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు.. ఇటువంటి కామెంట్లు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం.. పక్కాగా ఆధారాలు చూపించాలి. అంతేకాని రచ్చంతా చేసేసి.. నామానాన నేను కామెంట్లు చేస్తాను.. కాని అవన్నీ మీకెందుకు అంటే ఎలా? ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. సమాధానాలు చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు