పిక్ టాక్: కిక్ రావట్లేదు తమన్నా

పిక్ టాక్: కిక్ రావట్లేదు తమన్నా

ఒకప్పుడు తమన్నా వెండితెరపై అందచందాలను చిందించినా.. ఆ తరువాత ఫోటో షూట్లతో అదరగొట్టినా.. ఎందుకో ఆమెను చూస్తేనే చూపరులకు చాలా కిక్ వచ్చేసేది. కాని ఇప్పుడెందుకో అమ్మడు ఎన్ని గ్లామర్ ఫీట్లు చేసినా కూడా కిక్కే రావట్లేదు. నిజానికి ఈ ఫీలింగ్ చాలామంది ఎందుకు వచ్చింది అంటే ఆన్సర్ లేదు కాని.. వచ్చేసింది అనడానికి మాత్రం ఆమె కొత్త ఫోటోలను ఒకసారి తరిస్తే చాలు.

ఈ మధ్యన ఒక కొత్త ఫ్యాషన్ బ్రాండు తమన్నా స్నేహితురాలు అయిన ఒక ఫ్యాషన్ డిజైనర్ బట్టలు డిజైన్ చేసింది. ఆ బట్టల్లో తమన్నా మెరిసిపోతూ ఒక ఫ్యాషన్ ఫోటో షూట్ కూడా చేసింది. అయితే ఆ బట్టలన్నీ బాగానే ఉన్నాయి కాని.. తమన్నా మాత్రం ఏ కోశానా పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఎందుకోగాని ఈ మధ్యకాలంలో ఈమె చేసిన మ్యాగజైన్ కవర్ షూట్లు లేదంటే ఇటువంటి ఫ్యాషన్ ఫోటోలు.. అస్సలు కొత్తగా అనిపించట్లేదు. రొటీన్ గా ఉంటున్నాయి. బహుశా తమన్నా అందాలను ఎక్కువగా ఆరబోసేయడం వలన ఆమెపై కిక్ తగ్గుతోందా లేదంటే నవతరం భామలైన సమంత వంటి స్టార్లు బికినీల్లో మెరుస్తుంటే ఇక తమన్నా అందాలను పట్టించుకునేది ఎవరు అనుకోవాలా?

ఇకపోతే తమన్నా మాత్రం ఐపిఎల్ 2018 ప్రారంభోత్సవం ఈవెంట్లో డ్యాన్సులు వేయడానికి రెడీ అయిపోతోంది. కొన్న సౌత్ నెంబర్లకు డ్యాన్సులు వేయమ్మా అంటే.. కాదు కాదు అంటూ బాలీవుడ్ చార్ట్ బస్టర్లకు డ్యాన్సులు వేయడం కోసం ప్రిపేర్ అవుతోందట ఈ సుందరి. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు