కమ్ముల చేసింది కరెక్టేనా?

కమ్ముల చేసింది కరెక్టేనా?

ఏ రంగంలో అయినా ఒక స్థాయిలో ఉన్న వాళ్లు అందరి ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వరు. అన్ని విమర్శలకూ స్పందించరు. అవతల ప్రశ్నించేవాళ్లు.. విమర్శించే వాళ్లు.. ఆరోపణలు చేసే వాళ్ల స్థాయిని బట్టి ఇవతలి వ్యక్తి స్పందించాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుంది.

ఐతే నటి శ్రీరెడ్డి తన మీద సందేహాలు రేకెత్తేలా చేసిన ఆరోపణలపై దర్శకుడు శేఖర్ కమ్ముల రియాక్టయిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. శేఖర్ కమ్ములకు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ పరిశ్రమలోని చెడు పోకడలన్నింటికీ ఆయన దూరం. వ్యక్తిగా కూడా చాలా మంచి వాడిగా.. స్వచ్ఛమైన వాడిలా కనిపిస్తాడు శేఖర్. ఆయనతో పని చేసిన వాళ్లందరూ ఈ విషయాన్ని అంగీకరిస్తారు.

అలాంటిది శేఖర్ తన వెంట తిరిగేశాడన్నట్లు.. ఆయనకు వీడియో కాలింగ్ పిచ్చి ఉన్నట్లు.. తన సినిమాల్లో నటించే నటుల దగ్గర డబ్బులు తీసుకుంటాడన్నట్లు ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. శేఖర్ కమ్మల పేరు పెట్టలేదు కానీ.. గట్టిగా ఊదితే పడిపోతాడు.. కొమ్ములు వచ్చిన శేఖరుడు.. అనే మాటల్ని బట్టి చూస్తే అవి కమ్ములను ఉద్దేశించినవే అని జనాలకు సందేహాలు కలిగాయి. ఈ సందేహాల్ని కమ్ములనే స్వయంగా తీర్చేశాడు. శ్రీరెడ్డి విషయంలో ఆయన తీవ్రంగా స్పందిస్తూ క్షమాపణ చెప్పాలని లేకుంట లీగల్ యాక్షన్‌కు సిద్ధపడాలని అన్నాడు. ఈ విషయంలో తానెంత హర్టయింది కూడా కమ్ముల వివరించాడు. తన క్యారెక్టర్ ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే ఇలాంటివేమీ కమ్ముల చెప్పాల్సిన పని లేదు.

ఆయనపై జనాలకు అవే అభిప్రాయాలున్నాయి. శ్రీరెడ్డి విషయంలో స్పందించడం ద్వారా ఆమెకు అనవసర ప్రచారం కల్పించారని.. అలాంటి వాళ్ల మాటల్ని లెక్కలోకి తీసుకుని స్పందించాల్సిన అవసరం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కమ్ముల సైలెంటుగా ఉంటే.. కొందరు అదే నిజం అనుకునే ప్రమాదముందని.. ఆయన గురించి లేని పోని గుసగుసలు మొదలయ్యేవన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. మొత్తానికి ఇప్పటిదాకా శ్రీరెడ్డి ఆరోపణల్ని ఎవరూ పట్టించుకోక ఆమెకు సరైన ప్రచారం లేకపోయింది. కానీ కమ్ముల స్పందనతో రెండు రోజులుగా ఈ వ్యవహారం నలుగుతోంది. శ్రీరెడ్డి కోరుకున్నది ఇదే అని చెప్పాలి. ఐతే కమ్ముల కేవలం స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయకుండా సైబర్ క్రైమ్ పోలీసుల్ని సంప్రదించాలనుకుంటున్నాడని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English