పోర్న్ సైట్ లో నటి వీడియో.. డైరెక్టర్ పై కేస్

పోర్న్ సైట్ లో నటి వీడియో.. డైరెక్టర్ పై కేస్

ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు వారిపై జరుగుతోన్న అన్యాయాలను సమర్థవంతగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. బయటకి చెబితే అవకాశాలు రవేమో అనే భయం ఇప్పుడు ఎవరిలో ఎక్కువగా లేదు. బయటకి వచ్చి దైర్యంగా చెప్పేస్తున్నారు. రీసెంట్ గా భోజ్ పురిలో ఒక నటి దర్శకుడిపై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. షార్ట్ ఫిల్మ్ పేరుతో బాత్రూమ్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఈ న్యూస్ బయటకు వచ్చింది.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. 28 ఏళ్ల నటి ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఒప్పుకుంది. మూడు రోజుల పాటు షూటింగ్ జరిగింది. అయితే అందులో  టవల్ లో ఉన్న ఒక షార్ట్ తీయాలని డైరెక్టర్ ఉపేంద్ర కుమార్ వర్మ సూచించడంతో ఆమె కేవలం టవల్ మాత్రమే కప్పుకొని వచ్చింది. ఇక సడన్ గా టవల్ జారిపోవడంతో.. ఆ దృశ్యాలను కూడా చిత్రీకరించాడట దర్శకుడు వర్మ. తరువాత ఆ నటి ఆ సీన్స్ డిలీట్ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో అతను ఒప్పుకున్నాడు. కానీ ఆ తరువాత సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. అలాగే మూడు పోర్న్ సైట్స్ లలో కూడా వీడియో ఉన్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలుసుకుంది.

దీంతో వెంటనే ఆ నటి పోలీసులను ఆశ్రయించింది. షూటింగ్ మొత్తం ముంబాయ్ లో వర్మ ఆఫీస్ లో  జరిగిందని ఆమె FIR లో నమోదు చేసింది. అంతే కాకుండా మేకప్ కోసం అతను 15 వేల రూపాయల వరకు తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. దీంతో పోలీసులు ఉపేంద్ర వర్మ ను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్న ఫోన్ ను అలాగే ఒక ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. భోజ్ పూరి ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు