ఇతడిని బాలీవుడ్ బన్నీ అనాల్సిందే

ఇతడిని బాలీవుడ్ బన్నీ అనాల్సిందే

సినిమాకు వచ్చే టాక్ సూపర్.. బంపర్.. కేక అంటుంటేనే.. ఆ మూవీకి వసూళ్లు రావడం కష్టంగా ఉంది. కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని మరీ.. కమర్షియల్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అలాంటి సిట్యుయేషన్ లో క్రిటిక్స్ నుంచి విమర్శలు.. చూసిన జనాల నుంచి బిలో యావరేజ్ టాక్ వచ్చిన సినిమా పరిస్థితి ఎలా ఉండాలి?

ఫ్లాప్ అని ఆన్సర్ ఇవ్వడం తేలికే కానీ.. క్షణం హిందీ రీమేక్ బాఘీ2 రిజల్ట్ చూసి ఆ మాట చెప్పాలంటే నోరు రాదంతే. క్రిటిక్స్ పెదవి విరిచేశారు. పట్టుమని రెండు పాయింట్లు ఇచ్చేందుకు కూడా ఎవరికీ చేతులు రాలేదు. కానీ ఈ సినిమాకు తొలి నాలుగు రోజుల్లోనే 85 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు దక్కాయి. తొలి వారంలోనే 100 కోట్లు వసూలు చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. టైగర్ ష్రాఫ్-దిశా పటానీ పెయిర్ ను బాలీవుడ్ బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి ఫీట్స్ ఇప్పటివరకూ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఒక్కడికే సాధ్యం అయ్యేవి. అదెలా అంటారా?? అదిగో చూడండి.

సన్నాఫ్ సత్యమూర్తికి యావరేజ్ టాక్ వచ్చింది.. కానీ సినిమా 50 కోట్ల పైగానే వసూలు చేసింది.  ఇక సరైనోడు కు కూడా యావరేజ్ టాక్ మాత్రమే. ఆ తర్వాత డీజే అయితే మరీ బాగాలేదనేశారు జనాలు. కానీ సరైనోడు-డీజే చిత్రాలు 70 కోట్లకు మించి షేర్ ను కొల్లగొట్టేశాయి. ఇప్పుడు ఇదే తరహాలో యావరేజ్ టాక్ తో సినిమాలను సూపర్ సక్సెస్ చేస్తూ.. బాలీవుడ్ కి బన్నీగా మారిపోతున్నాడు టైగర్ ష్రాఫ్. అన్నట్లు బాలీవుడ్ లో కూడా బన్నీకి బోలెడంత డిమాండ్ ఉందండోయ్.. మనోడి డబ్బింగ్ సినిమాలు అక్కడ ఛానళ్లలోనూ యుట్యూబ్ లోనూ ఇరగాడేస్తున్నాయ్. మరి టైగర్ డబ్బింగ్ సినిమాలను తెలుగోళ్లు కూడా అలాగే ఆదరిస్తారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు