ప్రభుదేవా.. 500 కోట్ల రామాయణం

ప్రభుదేవా.. 500 కోట్ల రామాయణం

500 కోట్ల రామాయణం అనగానే టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కలిసి తీయాలనుకుంటున్న సినిమానే అందరికీ గుర్తుకొస్తుంది. దీనిపై గత ఏడాది నుంచి చర్చలు నడుస్తున్నాయి. ఐతే ఇప్పుడు మరో 500 కోట్ల రామాయణం తెరమీదికి వచ్చింది. ఈ ప్రతిపాదన చేసింది కొరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ ప్రభుదేవా కావడం విశేషం. ఎప్పటికైనా రామాయణాన్ని సినిమాగా తీయాలనేది తన కల అని వెల్లడించాడు ప్రభుదేవా.

ఈ చిత్రానికి రూ.500 కోట్ల నుంచి 600 కోట్ల దాకా బడ్జెట్ అవుతుందని కూడా అతను చెప్పాడు. ఎప్పటికైనా ఆ బడ్జెట్లో రామాయణం తీయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఐతే ప్రస్తుతం భారతీయ చిత్రాల బడ్జెట్ ఆ స్థాయిలో లేదని.. ఒక ఐదేళ్ల తర్వాత ఆ స్థాయికి చేరొచ్చని ప్రభుదేవా ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి ప్రభుదేవాను నమ్మి ఐదేళ్ల తర్వాతైనా రూ.500 కోట్లు పెట్టి రామాయణం సినిమాను ఎవరు నిర్మిస్తారో చూడాలి.

ప్రస్తుతం దర్శకత్వానికి విరామమిచ్చి నటుడిగా సినిమాలు చేస్తున్నాడు ప్రభుదేవా. సంక్రాంతికి అతను తమిళంలో నటించిన ‘గుళేబకావళి కథ’ విడుదలైంది. త్వరలోనే ‘మెర్క్యురీ’ అనే బహుభాషా చిత్రంతో అతను పలకరించబోతున్నాడు. ఈ సినిమా అయ్యాక ప్రభుదేవా హిందీలో సల్మాన్ హీరోగా దబంగ్-3 తీయబోతున్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు