ఆ వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన శేఖ‌ర్ క‌మ్ముల!

ఆ వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన శేఖ‌ర్ క‌మ్ముల!

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై న‌టి శ్రీ‌రెడ్డి కొద్ది రోజులుగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ కు చెందిన ఓ  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే, ఆ పోస్ట్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ములను ఉద్దేశించి చేసిన‌వేన‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. దీంతో, తాజాగా, త‌న పై  సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన‌ అభ్యంత‌ర‌క పోస్టుపై శేఖ‌ర్ క‌మ్ముల తీవ్రంగా స్పందించారు.

తానెపుడూ క‌ల‌వ‌ని, క‌నీసం త‌న‌తో ఫోన్ లో కూడా మాట్లాడ‌ని అమ్మాయి....త‌న‌పై అభ్యంత‌ర‌క వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌న‌స్తాపం క‌లిగించిందని శేఖ‌ర్ క‌మ్ముల అన్నారు. త‌న‌కు స్త్రీలంటే చాలా గౌర‌వ‌మ‌ని, త‌న‌పై ఇటువంటి నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని అన్నారు. ఆ వ్యాఖ్య‌లు త‌న‌ను, త‌న కుటుంబాన్ని బాధించాయ‌ని ఆయ‌న అన్నారు. త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తూ త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

``నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను`` అని శేఖ‌ర్ క‌మ్ముల త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కాగా, నిన్న సోషల్ మీడియాలో న‌టి శ్రీ‌రెడ్డి....``కొమ్ములు తిరిగిన శేఖ‌రుడు``అని సంబోధిస్తూ ఓ ద‌ర్శ‌కుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. `‘పెద్ద డైరెక్టర్ అని పొగరు.. అబద్ధాలు చెప్పడంలో దిట్ట.. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికి రారు అని అతడి ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా.. బక్క పీచు సోగ్గాడు.. వూదితే ఎగిరిపోయే ఇతనికి భయం బలం రెండూ ఎక్కువే.. టెక్నికల్ గా దొరకకుండా బాగా వాడాడు టెక్నాలజీని. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు.. వీడియో కాల్ కోసం ఏమైనా కోసుకుంటాడు పాపం.. మేల్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాకు.. వారెవరో కాదు.. కొమ్ములు వచ్చిన శేఖరుడు’` అని త‌న ఫేస్ బుక్ ఖాతాలో శ్రీ రెడ్డి నిన్న పోస్ట్ చేసింది. తాజాగా, శేఖ‌ర్ క‌మ్ముల పెట్టిన పోస్ట్ నేప‌థ్యంలో శ్రీ‌రెడ్డి స్పంద‌న ఎలా ఉంటుద‌న్న విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు