సూపర్‌స్టార్‌ సైడ్‌... మహేష్‌కి ప్లస్‌

సూపర్‌స్టార్‌ సైడ్‌... మహేష్‌కి ప్లస్‌

ఏప్రిల్‌ 27న కాలా రిలీజ్‌ ఖాయమని లైకా వాళ్లు ఘంటాపధంగా చెప్పారు కానీ అది విడుదలయ్యే సూచనలు లేవని తేలిపోయింది. తమిళ సినిమా పరిశ్రమలో కొనసాగుతోన్న బంద్‌ కారణంగా చాలా చిత్రాల రిలీజ్‌ డేట్లు మారాయి. క్యూలో వున్న సినిమాలకి అనుగుణంగా డేట్స్‌ కేటాయించాలి కనుక కాలా చిత్రం ఏప్రిల్‌లోనే కాదు, మేలో కూడా రిలీజ్‌ కాదని తెలిసింది.

దీంతో ఏప్రిల్‌ 27 డేట్‌ ఖాళీ అయిపోయింది. ఆ రోజున విష్ణు నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ డేట్‌ ఖాళీ అవడం మహేష్‌ సినిమా 'భరత్‌ అనే నేను'కి ప్లస్‌ అవుతుంది. ఏప్రిల్‌ 20న వచ్చే ఈ చిత్రానికి రెండు వారాలు ఫ్రీ రన్‌ దొరుకుతుంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్‌ 27 వీక్‌లో వున్న మే డేలాంటి పబ్లిక్‌ హాలీడేని ఫుల్‌గా క్యాష్‌ చేసుకునే అవకాశం వుంటుంది.

మే 4న 'నా పేరు సూర్య' వచ్చేలోగా మాగ్జిమం వసూళ్లు రాబట్టుకోవడానికి 'భరత్‌ అనే నేను'కి ఇంత కంటే మంచి అవకాశం వుండదు. ఇదిలావుంటే ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా జరుగుతూనే వుంది. 5వ తేదీతో ముగించాల్సిన షూట్‌ని మరో మూడు రోజులు పొడిగించారట. విడుదల తేదీ వారం రోజులు ముందుకు జరగడం వల్ల రీషెడ్యూలింగ్‌ అంత తేలిగ్గా కుదరలేదని, అందుకే కాస్త ఆలస్యం అవుతోందని సమాచారం. అయితే ఏప్రిల్‌ 20న విడుదలకి ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా ప్లాన్‌ చేసుకున్నారు కనుక కంగారు పడనవసరం లేదంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు