రామ్‌ చరణ్‌... గ్యాంగ్‌ లీడర్‌!

రామ్‌ చరణ్‌... గ్యాంగ్‌ లీడర్‌!

టైటిల్‌ చూసి రామ్‌ చరణ్‌ 'గ్యాంగ్‌లీడర్‌' రీమేక్‌ చేస్తున్నాడేమో అనుకోకండి. తదుపరి చిత్రంలో చరణ్‌ గెటప్‌ 'గ్యాంగ్‌ లీడర్‌'లో చిరంజీవి తరహాలో వుంటుందట. రంగస్థలంలో గుబురు గడ్డంతో కనిపించిన రామ్‌ చరణ్‌ ఆ గెటప్‌లోనే ఏడాదికి పైగా తిరిగాడు. షూటింగ్‌ పూర్తి కాగానే నీట్‌గా షేవ్‌ చేసుకుని 'బ్రూస్‌ లీ' గెటప్‌లో దర్శనమిచ్చిన చరణ్‌ని చూసి ఫాన్స్‌ కూడా కాస్త డిజప్పాయింట్‌ అయ్యారు.

మరీ ఇంత వేరియేషన్‌ లేకుండా కాస్త మాసిన గడ్డాన్ని అయినా మెయింటైన్‌ చేయాల్సిందని భావించారు. చరణ్‌ క్లీన్‌ షేవ్‌ లుక్‌ చూసిన బోయపాటి శ్రీను కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడట. కాస్త మాస్‌గా కనిపించాలని, 'గ్యాంగ్‌లీడర్‌'లో నాన్నగారి తరహా లుక్‌ కావాలని చెప్పాడట. దీంతో చరణ్‌ మళ్లీ కాస్త గడ్డం పెంచే పనిలో పడ్డాడు. రంగస్థలం ప్రమోషన్స్‌లో కనిపిస్తోన్న లుక్‌ బోయపాటి సినిమాకి ఫైనల్‌ లుక్‌ కాదట.

మరో పది, పదిహేను రోజులు షేవ్‌ చేయకుండా వుండాలని, అప్పుడు లుక్‌ ఫైనలైజ్‌ చేద్దామని బోయపాటి చెప్పాడట. అంటే 'చిరుత' సినిమాలో కనిపించిన తీరున చరణ్‌ తన తదుపరి చిత్రంలో కనిపించే అవకాశం వున్నట్టు అనిపిస్తోంది. ఫైనల్‌గా బోయపాటి ఏ లుక్‌ ఓకే చేస్తాడనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English