నితిన్ ఈ ధాటిని తట్టుకోగలడా?

నితిన్ ఈ ధాటిని తట్టుకోగలడా?

‘ఇష్క్’ తర్వాత నితిన్ కెరీర్ మంచి మలుపే తిరిగింది. తిరిగి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగని అతడి కెరీర్ మరీ సాఫీగా ఏమీ సాగిపోవట్లేదు. ఒక హిట్టు కొట్టడం.. మళ్లీ ఎదురు దెబ్బ తినడం.. మళ్లీ హిట్టు కొట్టడం అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. రెండేళ్ల కిందట ‘అఆ’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నితిన్. కానీ గత ఏడాది ‘లై’ అతణ్ని కింద పడేసింది.
ఇప్పుడు ఈ యువ కథానాయకుడి ఆశలన్నీ ‘చల్ మోహన్ రంగ’ మీదే ఉన్నాయి. త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడు రచయితగా ఈ చిత్రానికి అండగా ఉన్నాడు. ‘రౌడీఫెలో’తో సత్తా చాటుకున్న కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ పర్వాలేదనిపించాయి.

ఐతే నితిన్ సినిమా వస్తున్న టైమింగే గుబులు రేపుతోంది. ఏప్రిల్లో సినిమాను రిలీజ్ చేసుకోవడం మంచి అవకాశమే కానీ.. ముందు వారం ‘రంగస్థలం’ లాంటి భారీ సినిమాను పెట్టుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే ఆందోళన రేపింది. ఆ ఆందోళనకు తగ్గట్లే ‘రంగస్థలం’ మంచి టాక్‌తో, అదిరిపోయే వసూళ్లతో మొదలైంది. వీకెండ్ తర్వాత కూడా ఈ చిత్ర జోరు కొనసాగుతోంది. మరి ఈ ధాటిని నితిన్ తట్టుకుని నిలబడగలడా అన్నది సందేహం.

‘చల్ మోహన్ రంగ’ చూస్తే పూర్తి క్లాస్ సినిమాలా కనిపిస్తోంది. మాస్ సెంటర్లలో ‘రంగస్థలం’ను ఢీకొట్టి నిలవడం కష్టమే కావచ్చు. ఐతే టాక్ ఫుల్ పాజిటివ్ గా ఉంటే ఎ సెంటర్లలో దీనికి ఢోకా ఉండదు. మిగతా చోట్ల కూడా ఓ మోస్తరుగా ఆడుతోంది. ‘రంగస్థలం’కు తోడు మరో సినిమా కూడా ‘చల్ మోహన్ రంగ’ను టెన్షన్ పెట్టేదే. అదే.. కృష్ణార్జున యుద్ధం. తర్వాతి వారం రాబోతున్న ఆ చిత్రంపైనా మంచి అంచనాలున్నాయి. కాబట్టి ‘చల్ మోహన్ రంగ’ చాలా మంచి టాక్ తెచ్చుకుంటే తప్ప నిలవడం కష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు