ఆమెపై కంప్లెయింట్ ఇవ్వొచ్చుగా మరి??

ఆమెపై కంప్లెయింట్ ఇవ్వొచ్చుగా మరి??

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. సినిమాలలో సృష్టించలేకపోయిన సంచలనాలను.. టీవీ ఛానల్స్ లో సెన్సేషనల్ స్టేట్మెంట్స్ తో సాధిస్తోంది ఈమె. రోజుకో పేరు బయటకు చెబుతూ నానా హంగామా చేసి పారేస్తోంది.

అప్పుడొకరు.. ఇప్పుడొకరు అన్నట్లుగా పేర్లు చెబుతూ రచ్చ చేస్తున్న శ్రీరెడ్డి.. తాను ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినపుడు అన్ని సంగతులు బయట పెడతానని బెదిరిస్తోంది కూడా. ఇండస్ట్రీలో పెద్దలపై కామెంట్లు చేస్తూ నానా యాగీ చేస్తున్న ఈమెకు బ్రేక్ వేయడం ఎలా అనే అంశంపై ఇప్పుడు టాలీవుడ్  జనాలు తెగ సమాలోచనలు చేస్తున్నారట. పరిశ్రమలో అవకాశాలు కావాలని అంటూనే.. అదే పరిశ్రమపై బురద చల్లుతున్న ఈమె వైఖరి ఎవరికీ గిట్టడం లేదని టాక్ వినిపిస్తోంది. శ్రీరెడ్డిపై పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట. కానీ అలా చేస్తే సమస్య ఇంకా తీవ్రమవుతుందని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పోలీస్ కంప్లెయింట్ ఇస్తే.. పరిస్థితి చేయి జారిపోయినట్లే అని భావిస్తున్నారట. అపుడు ఆమె ఏం చెప్పినా దానికి ఇంకా వెయిట్ పెరిగిపోతుంది. అలాగే ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలను కెలికితే.. పోలీసులు రంగంలోకి దిగితే డొంక కదులుతుందేమో అని కొందరు భయపడుతున్నారు. కొందరేమో పరువు పోతోంది ఆమెను ఆపుదాం అంటున్నారు. మరి కంప్లయింట్ ఇస్తారా.. లేదా ఏదన్నా సెటిల్మెంట్ చేస్తారా అనే విషయం చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు