సినిమా వేస్టంటున్నారు.. వసూళ్ల మోతే

సినిమా వేస్టంటున్నారు.. వసూళ్ల మోతే

గత శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన హిందీ సినిమా ‘బాఘి-2’. తెలుగు హిట్ సినిమా ‘క్షణం’ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఐతే హిందీలోకి వెళ్లే సరికి ఈ థ్రిల్లర్ కాస్తా యాక్షన్ సినిమా అయిపోయింది. ఈ చిత్రానికి క్రిటిక్స్ చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. ఈ సినిమా వేస్ట్ అని తేల్చేశారు.

కానీ ఆ రివ్యూలకు సినిమా వసూళ్లకు అసలు పొంతనే లేదు. ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. ఒక సూపర్ స్టార్ సినిమా స్థాయిలో ఇది వసూళ్ల ప్రభంజనం సాగిస్తోంది. నాలుగు రోజల్లోనే ‘బాఘి-2’ రూ.85 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇంకో రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది.

తొలి రోజే ఏకంగా రూ.25 కోట్ల వసూళ్లలో సంచలనం సృష్టించింది ‘బాఘి-2’. రెండో రోజు రూ.20.4 కోట్ల గ్రాస్ రాగా.. మూడో రోజైన ఆదివారం ఏకంగా రూ.27.6 కోట్లు కొలగొట్టిందీ చిత్రం. సోమవారం బంద్ కారణంగా ఉత్తరాదిన చాలా చోట్ల థియేటర్లు మూత పడ్డా సరే.. ఈ చిత్రానికి రూ.12.1 కోట్ల గ్రాస్ రావడం విశేషం. సోమవారం మామూలుగానే ఈ స్థాయిలో వసూళ్లంటే ఆశ్చర్యమే.

అలాంటిది బంద్ అయినా అంత కలెక్షన్లంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలిచ్చారు. బాలీవుడ్లో గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు క్లాస్ సినిమాలే ఎక్కువగా చేస్తుండటంతో మాస్ సినిమాలు తగ్గిపోయాయి. టైగర్ ష్రాఫ్ మాస్ ప్రేక్షకుల్ని అలరించేలా మాంచి యాక్షన్ సినిమాతో రావడంతో ఆ వర్గం ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English