రంగస్థలంపై అల్లు బ్రదర్స్‌ సైలెన్స్‌?

రంగస్థలంపై అల్లు బ్రదర్స్‌ సైలెన్స్‌?

రంగస్థలం అంత పెద్ద హిట్‌ అయితే, రామ్‌ చరణ్‌ నటనపై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తోంటే, అతని కాంపిటీషన్‌ అయిన హీరోలు సయితం విపరీతంగా అభినందిస్తోంటే, అల్లు బ్రదర్స్‌ మాత్రం ఇంతవరకు ఈ చిత్రం గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. అల్లు అర్జున్‌ అయితే ఇంతవరకు రంగస్థలం గురించి ట్వీటేమీ చేయలేదు. ఆ సినిమా పాటలు తన తనయుడికి బాగా నచ్చాయని అన్నాడే తప్ప తాను వినలేదనే చెప్పాడు. విడుదలై నాలుగు రోజులవుతున్నా సినిమా చూసే తీరిక లేకపోయినా కనీసం చరణ్‌ని అభినందించడానికి క్షణం తీరిక చేసుకోలేకపోయాడని మెగా అభిమానులు గుస్సా అవుతున్నారు. మరోవైపు అతని తమ్ముడు శిరీష్‌ రంగస్థలం రిలీజ్‌ రోజు సూపర్‌ రిపోర్ట్స్‌ వింటున్నానని, సాయంత్రం సినిమా చూస్తున్నానని చెప్పాడు. కానీ సినిమా చూసిన తర్వాత దాని గురించి కానీ, చరణ్‌ అభినయం గురించి కానీ సింగిల్‌ కామెంట్‌ చేయలేదు.

దీనిపై మెగా అభిమానులు మరోసారి అల్లు బ్రదర్స్‌పై చాలా కోపంగా వున్నారు. వేరే సినిమాలు చూసేందుకే తీరిక చేసుకోని పవన్‌ కళ్యాణ్‌ 'రంగస్థలం' రిలీజ్‌ రోజే చరణ్‌ని అభినందించాడు. ఎన్టీఆర్‌ అయితే ఈ చిత్రంపై పెద్ద పెద్ద ట్వీట్లతో చాలా ప్రశంసలు కురిపించాడు. సొంత వారయి వుండీ వీళ్లు ఏమీ మాట్లాడకపోవడం ఇప్పటికే 'చెప్పను బ్రదర్‌' కాంట్రవర్సీతో రగిలిపోయి వున్న ఫాన్స్‌కి మరింత కోపం తెప్పిస్తోంది. అభిమానుల ఆక్రోశం ఏమిటో సోషల్‌ మీడియా చూస్తూనే వుంటారు కనుక రంగస్థలం గురించి అల్లు హీరోలు పెదవి విప్పేదెప్పుడో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English