వారం తిరిగేలోగా లాభాలు ఖాయం

వారం తిరిగేలోగా లాభాలు ఖాయం

రంగస్థలం జోరు అలా ఇలా లేదు. మూడు రోజుల పాటు బాక్సాఫీస్‌ని వీర దున్నుడు దున్నిన ఈ చిత్రం నాలుగవ రోజున కాస్త సద్దుమణుగుతుందని భావించారు. కానీ నాలుగవ రోజున కూడా అన్ని ఏరియాల్లోను అదే దూకుడు చూపిస్తూ హౌస్‌ఫుల్స్‌తో రన్‌ అవుతోంది. ఇంత స్పందన ఒకేసారి సద్దుమణగదు కనుక మంగళ, బుధ వారాల్లోను డ్రాప్స్‌ వుండవని స్పష్టమవుతోంది. తొలి మూడు రోజుల్లో యాభై ఎనిమిది కోట్ల షేర్‌ రాబట్టిన ఈ చిత్రం తొలి వారం తిరిగేలోగా లాభాల్లోకి వెళుతుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఎనభై కోట్ల రేషియోలో రైట్స్‌ అమ్మగా, ఆ ఎనభై కోట్ల షేర్‌ తొలి వారంలోనే రావడం ఖాయంగా కనిపిస్తోంది. సెకండ్‌ వీకెండ్‌ పర్‌ఫార్మెన్స్‌ని బట్టి 'ఖైదీ నంబర్‌ 150' రికార్డుని అధిగమిస్తుందా లేదా అనేది తెలుస్తుంది. నాన్‌ బాహుబలి రికార్డులు ఖాయమని నిర్మాత నవీన్‌ థాంక్యూ మీట్‌లో ఎక్స్‌ప్రెస్‌ చేసారు. ట్రేడ్‌ సర్కిల్స్‌ కూడా సెకండ్‌ వీకెండ్‌ వసూళ్లు స్ట్రాంగ్‌గా వుంటే ఈజీగా ఖైదీ నంబర్‌ 150ని బీట్‌ చేస్తుందని చెబుతున్నారు. సుకుమార్‌ డైరెక్షన్‌ అనే సరికి మాస్‌ ఏరియాల్లో అంత స్పందన వుండదని భావించారు కానీ ఒక పక్కా మాస్‌ సినిమాతో సుకుమార్‌ అందరినీ సర్‌ప్రైజ్‌ చేసాడు. ప్రస్తుతం బి, సి సెంటర్లలోను ఎక్స్‌ట్రా షోస్‌తో విజయదుందుభి మోగిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English