రంగస్థలం జోరుని ఆపే సీనుందా?

రంగస్థలం జోరుని ఆపే సీనుందా?

రంగస్థలం అత్యద్భుత ఆరంభాన్ని అందుకున్నా లాంగ్‌ రన్‌ విషయంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భరత్‌ అనే నేను వచ్చే వరకు పెద్ద సినిమా లేకపోవడం కలిసి వచ్చే అంశమైనా ఈలోగా రెండు మీడియం బడ్జెట్‌ సినిమాలు వస్తున్నాయి. ఈ గురువారం నితిన్‌ నటించిన 'ఛల్‌ మోహన్‌ రంగ' రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రానికి పవన్‌, త్రివిక్రమ్‌ నిర్మాణ భాగస్వాములు కావడంతో క్రేజ్‌ కాస్త ఎక్కువే వుంది. పెద్ద సినిమాల మధ్య విడుదల చేయడానికి కూడా నిర్మాతలు భయపడకపోవడంతోనే ప్రాజెక్ట్‌పై వారికున్న నమ్మకం తెలుస్తోంది. అటు యుఎస్‌లో, ఇటు ఏ సెంటర్స్‌లో రంగస్థలం జోరుకి ఇది కళ్లెం వేయగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇప్పటికే వైరల్‌ అయిపోయిన రంగస్థలం చిత్రాన్ని తప్పకుండా చూడాలనే కాంక్ష అందరిలో కలిగింది. ఇందువల్ల వెంటనే మరో సినిమా వచ్చినా కానీ దీనిపై నుంచి దృష్టి అంత ఈజీగా మరలిపోతుందని అనుకోలేం. నితిన్‌ సినిమా బాగుందనే టాక్‌ వచ్చినా కానీ రంగస్థలం జోరుకి బ్రేక్‌ వేసేటంత సీన్‌ వుండదని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. నాని 'కృష్ణార్జున యుద్ధం' విడుదలయ్యే వరకు రంగస్థలం జోరు కొనసాగుతుందని, ఆ తర్వాత ప్రేక్షకులు అటెన్షన్‌ వేరే సినిమాల వైపు మరలవచ్చునని, ఎలా చూసినా 'భరత్‌ అనే నేను' వచ్చే వరకు షేర్స్‌ వస్తూనే వుంటాయని ట్రేడ్‌ నిపుణుల అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English