పెళ్లి చూపులకు వెళ్ళిన చెన్నై చంద్రం?

పెళ్లి చూపులకు వెళ్ళిన చెన్నై చంద్రం?

సొట్టబుగ్గలు.. సోగకళ్లతో టాలీవుడ్.. కోలీవుడ్ లను ఏలేసింది చెన్నై బ్యూటీ త్రిష. తన కెరీర్ మొత్తం గ్లామర్ ఓరియంటెడ్ రోల్స్ పైనే ఫోకస్ చేసింది. ఈ పదేళ్ల కాలంలో బోలెడంత మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చేశారు. వారిలో చాలామంది గ్లామర్ డాల్సే కావడంతో త్రిషకు గట్టిపోటీ ఎదురైంది. గ్లామర్ నే నమ్ముకున్న త్రిషకు ఛాన్సులు తగ్గిపోతూ వచ్చాయి.

నిన్న మొన్నటి వరకు అడపాదడపా అన్నట్టుగా ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటిస్తూ వచ్చింది త్రిష. ఈమధ్య కాలంలో ఆమాత్రం ఆఫర్లు కూడా రావడం లేదు. దీంతో కెరీర్ కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకునే ఆలోచనలో పడిందీ సుందరి. రెండు వారాలుగా స్కాట్ ల్యాండ్.. అమెరికా అంటూ ట్రిప్పులు కొడుతోంది త్రిష. ఖాళీ టైం దొరికింది కాబట్టి వెకేషన్ అని పైకి చెబుతున్నా వరుడి వేటలో భాగంగా ఈ టూర్ కు వెళ్లిందని తెలుస్తోంది. త్రిష బంధువుల ఆమె రేంజ్ కు తగ్గట్టు అమెరికాలో రెండు మూడు సంబంధాలు చూశారట.  ఇటు విహారం లానూ ఉంటుంది.. అటు అబ్బాయిల మంచి చెడులూ తెలుసుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ టూర్ ప్లాన్ చేసిందని కోలీవుడ్ లో టాక్.

ప్రస్తుతం త్రిష తమిళంలో అరవింద్ స్వామి హీరోగా నటిస్తున్న శతురంగ వేట్టై సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతోపాటు మోహిని అనే హర్రర్ సినిమా కూడా చేస్తోంది. ఇంతకుముందు నాయకి అనే హర్రర్ సినిమా చేసినా అది బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. మోహిని సినిమాతో ఈసారి జనాలను కచ్చితంగా భయపెడతానని త్రిష నమ్మకంగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు