స‌మంత‌కి తెలివి కొంచెం ఎక్కువే!!

స‌మంత‌కి తెలివి కొంచెం ఎక్కువే!!

పెళ్ల‌యిన త‌ర్వాత  ‘రంగ‌స్థ‌లం’ లాంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్  హిట్టు కొట్టి... సంతోషంగా ఉంది అక్కినేని స‌మంతా. ఈ సినిమాలో రామ‌ల‌క్ష్మీగా అచ్చ‌మైన ప‌ల్లెటూరి ప‌డుచు పిల్ల‌గా అతి స‌హ‌జంగా క‌నిపిస్తూనే... అంతే అందంగా క‌నిపించింది స‌మంత‌. అభిన‌యంలోనూ త‌న‌కు సాటిలేదంటూ మ‌రోసారి నిరూపించుకుంది. తాజాగా త‌న‌కు టాలెంట్ మాత్ర‌మే కాదు... ఇంటెలిజెన్స్ పాలు కూడా కొంచెం ఎక్కువేన‌ని నిరూపించుకుంది.

సోష‌ల్ మీడియాలో పూట‌కో పోస్టుతో తెగ యాక్టివ్‌గా ఉండే స‌మంత‌... ‘రంగ‌స్థ‌లం’ విజ‌యానందాన్ని త‌న అభిమానుల‌తో పంచుకునేందుకు ట్విట్టర్ అకౌంట్‌ను వేదికగా చేసుకుంది. ఎటువంటి సందేహాల‌నైనా ‘ఆస్క్ సామ్‌...’ హాష్ ట్యాగ్‌తో అడ‌గ‌వ‌చ్చిన అభిమానులకు ప్ర‌క‌టించింది స‌మంత‌. త‌న అభిమాన హీరోయిన్ ఇచ్చిన ఆఫ‌ర్‌ను వ‌ద‌ల‌ని అభిమానులు... ఆమెపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఇక్క‌డే ఓ అభిమాని... త‌న తెలివి ప్ర‌ద‌ర్శించాల‌ని అనుకున్నాడు. ‘నాగ‌చైత‌న్యకి శ్రీ‌మ‌తి... కింగ్ నాగార్జున‌కి కోడ‌లు... లెజెండ‌రీ అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకి మ‌న‌వ‌రాలు... వీటిలో ఎలా ఉండ‌డం మీకు గ‌ర్వంగా అనిపిస్తోంది...’ అంటూ ప్ర‌శ్నించాడు ఓ నెటిజ‌న్‌. ఇది చాలా క‌ష్ట‌మైన ప్ర‌శ్నేక‌దా! అన్న‌ట్టు ఎమోజీ కూడా జ‌త‌చేశాడు.

అయితే అంత క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కి కూడా సూటిగా... కొంటెగా స‌మాధాన‌మిచ్చేసింది స‌మంతా. ‘ద‌ట్ ఐ యామ్‌... మై హాస్బెండ్స్ వైఫ్‌’ అంటూ రిప్లై ఇచ్చింది స‌మంతా. నాగ‌చైత‌న్య‌కి భార్య కావ‌డం వ‌ల్లే మిగిలిన హోదాల‌న్నీ ద‌క్కాయ‌నే విష‌యాన్ని చిన్న స‌మాధానంతో తేల్చేసిందీ చిన్న‌ది. అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ  ఓపిక‌గా స‌మాధానం ఇచ్చిన స‌మంతా తెలివిని చూసి... ‘సామ్‌... ఎంతైనా గ‌డుసుదే!’ అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు ఆమె అభిమానులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు