మహేష్ హీరోయిన్ రెచ్చిపోయిందే..

మహేష్ హీరోయిన్ రెచ్చిపోయిందే..

తెలుగులో చేస్తున్న తొలి సినిమాలోనే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో పని చేయడమంటే చిన్న విషయం కాదు. ఈ అదృష్టమే దక్కించుకుంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’లో అతడి భార్య సాక్షి పాత్రలో కనిపించిన మెప్పించిన కియారా.. మహేష్-కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటిదాకా కియారాకు సంబంధించి బయటికి వచ్చిన ఫొటోలన్నింట్లో చాలా ట్రెడిషనల్‌గానే కనిపించింది. ‘ధోని’ సినిమాలోనే కాక.. మహేష్ మూవీలోనూ ఆమె ట్రెడిషనల్ క్యారెక్టరే చేస్తున్నట్లుగా ఉంది. ‘భరత్ అనే నేను’ నుంచి బయటికి వచ్చిన ఫొటోల్లో చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించిందామె.

ఐతే తనలో హాట్ యాంగిల్ కూడా ఉందని చాటే ప్రయత్నం చేస్తోంది కియారా. తాజాగా ముంబయిలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో కియారా క్లీవేజ్ అందాలతో మత్తెక్కిచ్చింది. కియారా ఈ స్థాయిలో ఇంతకుముందెన్నడూ ఎక్స్‌పోజింగ్ చేసింది లేదు. తాను సాటి బాలీవుడ్ హాట్ భామలకు ఏమాత్రం తక్కువ కాదని.. తనను ఈ యాంగిల్లో చూపించుకోవచ్చని చాటే ప్రయత్నం చేసిందామె.

ఐతే ‘భరత్ అనే నేను’లో ఆమె నుంచి ఇలాంటి అందాల ప్రదర్శన ఆశించలేమేమో. చరణ్ సినిమాలో బోయపాటి కావాలంటే అందాలు ఆరబోయించొచ్చు. ‘భరత్ అనే నేను’ అంచనాలకు తగ్గట్లు ఆడి.. చరణ్ సినిమా కూడా హిట్టయితే తెలుగులో కియారా పెద్ద రేంజికి వెళ్లిపోతుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు