మహేష్ బాబు ఇప్పుడు చాలానే కొట్టాలి

మహేష్ బాబు ఇప్పుడు చాలానే కొట్టాలి

మహేష్ బాబు సినిమా కనుక బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయిందంటే వసూళ్ల వర్షంతో పాటు.. అనేక రికార్డులు తుడిచిపెట్టుకుపోతుంటాయి. కానీ మహేష్ గత చిత్రాలు నిరుత్సాహపరచడంతో.. సూపర్ స్టార్ రికార్డులు దాదాపుగా చేజారిపోయాయి. శ్రీమంతుడు మూవీతో చాలానే లెక్కలు సరిచేశాడు మహేష్.

కానీ ఆ తర్వాత పలు చిత్రాలు భారీ సక్సెస్ లు సాధించి శ్రీమంతుడు రికార్డ్స్ ను దాటేశాయి. ఓవర్సీస్ రికార్డుల వరకు మహేష్ పేరిట ఉన్నాయని ఫ్యాన్స్ ఆనందించే అవకాశాన్ని రంగస్థలం తుడిచిపెట్టేస్తోంది. ఫాస్టెస్ట్ 2 మిలియన్ గ్రాసర్ గా అవతరించిన రంగస్థలం.. ఫుల్ రన్ లో శ్రీమంతుడు వసూళ్లను దాటేయడం ఖాయం అంటున్నారు. ఇప్పుడు మహేష్ మళ్లీ రికార్డులను తన ఖాతాలో వేసుకోవాలంటే కొత్త రికార్డులు సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఫిలిం ట్రెండ్ బాగానే ఉంది. రంగస్థలం పుణ్యమా అని జనాల్లో కూడా ఆసక్తి బాగా పెరుగుతోంది.

ఇలాంటి సమయంలో.. అది కూడా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ కాగానే వచ్చే సినిమా భరత్ అనే నేను. కొరటాల కాంబినేషన్ కూడా జత కావడంతో.. మహేష్ బాబు కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. కొంత ఒత్తిడి ఉన్నా.. టాక్ బాగుంటే మాత్రం ఈ చిత్రం మళ్లీ బాక్సాఫీస్ లో కొత్త రికార్డులను రాసేయడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు