రజినీని రీప్లేస్ చేయబోతున్న విష్ణు?

రజినీని రీప్లేస్ చేయబోతున్న విష్ణు?

పాపం మంచు విష్ణు. ఈ మధ్య అతడికి అస్సలు కలిసి రావట్లేదు. గత ఏడాది ‘లక్కున్నోడు’ అనే సినిమా చేశాడతను. ఆ సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. ఆ తర్వాత ఎన్నో ఆశలతో ‘ఆచారి అమెరికా యాత్ర’ మొదలుపెడితే.. దానికి ఏదో ఒక అడ్డంకి తప్పట్లేదు. షూటింగ్ సందర్భంగా విష్ణు గాయపడి కొన్నాళ్ల పాటు పని ఆగిపోయింది. ఆ తర్వాత కోలుకుని సినిమా పూర్తి చేసినా అనుకున్న సమయానికి విడుదల కావట్లేదు. జనవరి 26కే సినిమాను అనుకున్నారు కానీ.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. రెండున్నర నెలల తర్వాత ఒక డేట్ చూసుకుని రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. అది కూడా కుదరట్లేదు. ఏప్రిల్ 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని రోజుల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐతే ఏప్రిల్ 5న నితిన్ సినిమా ‘చల్ మోహన్ రంగ’ రిలీజవుతుండటం.. ముందు వారం వచ్చిన ‘రంగస్థలం’ అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తుండటంతో ‘ఆచారి’ టీంలో గుబులు పట్టుకుంది. ఇప్పుడు సినిమాను రిలీజ్ చేయడం మంచిది కాదని వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 27న రావాల్సిన రజినీకాంత్ సినిమా ‘కాలా’ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్లో స్ట్రైక్ ఇంకా కొనసాగుతుండటంతో సినిమా ఆ తేదీకి రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు. రజినీ సినిమా డ్రాప్ అయ్యే పక్షంలో ఏప్రిల్ 27న ‘ఆచారి అమెరికా యాత్ర’ను రిలీజ్ చేసేయాలని చిత్ర బృందం భావిస్తోందట. విడుదలకు ఇంకో ఐదారు రోజులే ఉన్నప్పటికీ అసలు ప్రచార కార్యక్రమాలేమీ లేకపోవడాన్ని బట్టి ఈ చిత్రం మరోసారి వాయిదా పడటం ఖాయమనే అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English