చెర్రీకి అజ్ఞాతవాసి అండ్ అరవింద్ సాయం

చెర్రీకి అజ్ఞాతవాసి అండ్ అరవింద్ సాయం

రామ్ చరణ్ మూవీ రంగస్థలం రికార్డు కలెక్షన్స్ సాధిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో రంగస్థలం కలెక్షన్స్ చూసి ట్రేడ్ జనాలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రీమియర్స్ వసూళ్లకు దాదాపు సమానంగా ఫస్ట్ డే కలెక్షన్స్ రావడం అందరినీ ఆశ్చర్యయపరుస్తోంది. ఇలా భారీ వసూళ్లను సాధించడం వెనుక.. ఇద్దరి సాయం ఉందని అంటున్నారు. అందులో ఒకరు పవన్ కళ్యాణ్ కాగా.. మరొకరు అల్లు అరవింద్.

అజ్ఞాతవాసి చిత్రాన్ని 500లకు పైగా సెంటర్స్ లో ప్రీమియర్స్ వేశారు. 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో ప్రీమియర్స్ లో నాన్ బాహుబలి రికార్డు సృష్టించినా సరే.. ప్రీమియర్స్ వేసిన 70 శాతం థియేటర్లలో 1000 డాలర్లు కూడా వసూలు కాలేదు. అంటే ఏ సెంటర్‌లో స్ట్రెంగ్త్ ఉందనే విషయంపై.. ముందుగా పర్ఫెక్ట్ అవగాహన వచ్చేందుకు అజ్ఞాతవాసి రూపంలో పవన్ కళ్యాణ్ సాయం చేశాడు. మరోవైపు రంగస్థలంను లిమిటెడ్ గా రిలీజ్ చేశారు. ఇది పక్కాగా అల్లు అరవింద్ వ్యూహంగా చెప్పాలి. సరైనోడు రిలీజ్ సమయంలో అసలు ప్రీమియర్స్ వద్దన్నారు అల్లు అరవింద్. అప్పుడు ఆయన నిర్ణయం ట్రేడ్ జనాలను మెప్పించలేదు. అలాగే రిలీజ్ కూడా చాలా పరిమితంగానే చేశారు.

ఓవర్సీస్ లోనే కాదు.. లోకల్ గా కూడా తక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం అనే వ్యూహం.. ఎక్కువ షేర్ వసూళ్లకు కారణం అయింది. బన్నీ సినిమాల రేంజ్ అంతకంతకూ పెరిగేందుకు సహాయపడింది. ఇప్పుడు రామ్ చరణ్ మూవీ రంగస్థలంకు.. అడిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 శాతం థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉన్నా కూడా.. లిమిటెడ్ రిలీజ్ చేయడం వెనుక అల్లు అరవింద్ వ్యూహమే ఉంది. అదే చిత్రాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు