హీరోలకు పిచ్చిపడితే ఇలాగే ఉంటుంది

హీరోలకు పిచ్చిపడితే ఇలాగే ఉంటుంది

సినిమా హీరోలు.. తమతో నటించిన హీరోయిన్లను ప్రమోట్ చేస్తుండడం గమనిస్తూనే ఉంటాం. హిట్టు కాంబోలయితే రిపీట్ చేస్తుండడం కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఆ హీరోయిన్ కెరీర్ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ప్రోత్సహించడం కోసం రికమెండేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఓ హీరోయిన్ ని ప్రమోట్ చేస్తున్నాడట ఒక టాలీవుడ్ యంగ్ హీరో.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చి ఫ్లాప్ అయింది. ఆ వెంటనే అదే హీరోయిన్ తో చేసిన మరో సినిమా త్వరలోనే రిలీజ్ కి రెడీ అయిపోతోంది. కేవలం రెండు సినిమాలు చేసినా.. చేతిలో ప్రాజెక్టులు లేకపోయినా.. ఈమె ఓ లక్కీ లేడీ అన్నట్లుగా.. పెర్ఫామెన్స్ చించేస్తుంది అన్న రేంజ్ లో ప్రమోట్ చేస్తూ రికమెండ్ చేస్తున్నాడని అంటున్నారు.. తన సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకుంటే ఓకే.. ఇండస్ట్రీలో తనకు స్నేహితులు అయిన ప్రతీ యంగ్ హీరోకు రికమెండ్ చేస్తున్నాడట. ఆమెకు అవకాశం ఇవ్వాలని తెగ వెంటబడుతున్నాడట.

ఇంతకీ ఈ హీరో ఇంతగా తాపత్రయపడడానికి కారణం ఏంటి అనే విషయం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ ఇప్పటికీ ఈ భామకు రెండు ప్రాజెక్టులు ఖాయం అయ్యాయట. తన మొదటి రెండు సినిమాలతోను ఫ్లాప్ లు కొట్టిన ఓ వారసుడు.. వరుస ఫ్లాపులతో బోల్తా కొడుతున్న మరో వారసుడు.. ఈమెకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు