జ‌ర్న‌లిజంలోకి అడుగుపెట్టిన‌ ఓలా!

జ‌ర్న‌లిజంలోకి అడుగుపెట్టిన‌ ఓలా!

ప్ర‌స్తుతం మార్కెట్లో ప్ర‌జ‌ల‌కు నిత్యం వార్త‌ల‌ను అందించే న్యూస్ పేప‌ర్లు, చానెళ్లు, వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, యాప్ లు కోకొల్ల‌లుగా ఉన్నాయి.  స్మార్ట్ ఫోన్, సోష‌ల్ మీడియా వాడకం పెరిగిన త‌ర్వాత చిటికెలో వార్త‌లు, వింత‌లు..విశేషాలు ప్ర‌జ‌ల‌కు చేరిపోతున్నాయి. అయితే పైన చెప్పిన మాధ్య‌మాలు.... స్థానిక వార్త‌లు, స‌మాచారాన్ని ఒక స్థాయి వ‌ర‌కే అందిస్తున్నాయి.

ఎఫ్ ఎమ్ స్టేష‌న్ల ద్వారా సిటీ న్యూస్ ఎంతో కొంత తెలుసుకునే వీలుంది. ఈ నేప‌థ్యంలో న‌గరం న‌డిబొడ్డు నుంచి మొద‌లుకొని గ‌ల్లీల్లో జ‌రిగే ముఖ్యమైన‌ స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వేసేందుకు ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా `ఓలా న్యూస్ నెట్ వ‌ర్క్` ను ప్రారంభించింది. ట్యాక్సీ సేవలతో పాటు ఓలా...జ‌ర్న‌లిజంలోకి అడుగుపెట్టింది. ఇక‌పై  ఓలా `ప‌క్కా లోక‌ల్ న్యూస్` అందించ‌నుంది.

దేశంలోని 110 నగరాల్లో ఓలా త‌ర‌ఫున 10 ల‌క్ష‌ల‌ మంది డ్రైవర్లు సేవలు అందిస్తున్నారు. వారంద‌రూ త‌మ విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా న‌గ‌రంలోని ప్ర‌తి గ‌ల్లీని చుట్టేస్తుంటారు. దీంతో, వారికి న‌గ‌రంలో జ‌రిగే ముఖ్య విష‌యాల‌పై ప్రాథ‌మిక స‌మాచారం త‌ప్ప‌క ఉంటుంది. ఆ స‌మాచారాన్ని త‌మ యూజ‌ర్ల కు అందించాల‌ని ఓలా సంక‌ల్పించింది. అందుకే త‌మ క్యాబ్ డ్రైవ‌ర్ల‌ను `ఘోస్ట్ రిపోర్ట‌ర్లు`గా మార్చేసింది.

వీరంతా, స్థానిక అంశాల‌పై నాణ్యమైన వార్తలను వినియోగదారులకు అందిస్తుంటారు. న‌గ‌రంలోని ట్రాఫిక్, వాతావ‌ర‌ణం, ఈవెంట్స్...వంటి స్థానిక అంశాల‌తో పాటు రాజ‌కీయం, క్రీడ‌లు, స్టాక్ మార్కెట్....వంటి అంశాల‌పై కూడా తాజా సంక్షిప్త వార్త‌ల‌ను ఓలా యాప్ ద్వారా అందించ‌నుంది. ఈ యాప్ న‌కు సంబంధించిన ప్రోమో వీడియోను ఓలా యూట్యూబ్ లో విడుదల చేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియాఓ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆ యాప్ ...ప్ర‌జ‌ల‌ను ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు