దేవిశ్రీప్రసాద్‌ని తిట్టిపోస్తున్న ఫాన్స్‌

దేవిశ్రీప్రసాద్‌ని తిట్టిపోస్తున్న ఫాన్స్‌

రంగస్థలం చిత్రానికి బ్లాక్‌బస్టర్‌ ఆడియో ఇచ్చి, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసిన దేవిశ్రీప్రసాద్‌ని మామూలుగా అయితే అభిమానులు నెత్తిన పెట్టుకోవాలి. కాకపోతే ఒక మచ్చలా ఇందులో కీలకమైన 'ఆ గట్టునుంటావా' పాటకి ఒరిజినల్‌ సింగర్‌ పాడినది తీసేసి తను పాడుకున్న ట్రాక్‌ని సినిమాలో పెట్టడంతో ఫాన్స్‌ తీవ్రంగా హర్ట్‌ అయ్యారు.

ఈ పాటకి ఫోక్‌ సింగర్‌ వుండాలంటూ శివనాగులుతో ఏరి కోరి ఈ పాట పాడించాడు డీఎస్పీ. అంతే కాకుండా శివనాగులుని స్టేజీపైకి పిలిపించి అతడిని బాగా పొడిగేసాడు. అంతా చేసి సినిమాలో తను పాడిన ట్రాక్‌ సాంగ్‌ని పెట్టేసి శివనాగులు వాయిస్‌ వినపడకుండా చేసాడు. ఆ ఫోక్‌ సింగర్‌ పాడిన పాటకి అలవాటు పడిపోయిన వారికి సినిమాలో దేవి స్వరంలో ఈ పాట అసలు నచ్చడం లేదు. దీంతో చాలా మంది డైరెక్టుగానే దేవిని తిట్టి పోస్తున్నారు. ఎంతమంది తనని తిడుతున్నా ఇంకా ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది దేవి వివరణ ఇవ్వలేదు.

జానపదాలు పాడే గాయకుడికి దేవిశ్రీప్రసాద్‌ నిజంగా పెద్ద అన్యాయమే చేసాడు. ఆడియోలో అతని పాటే వున్నా కానీ ఇంత పెద్ద సినిమాలో అతని పాట వుండి వుంటే అతనికి చాలా ప్లస్‌ అయ్యేది. అదీ కాకుండా అంత అద్భుతంగా పాడిన సింగర్‌ని కాదని ఏమాత్రం ఎనర్జీ లేని తన వాయిస్‌తో పాటని ఖూనీ చేయడం కూడా తన స్టార్‌డమ్‌కి తగ్గ పద్ధతి అనిపించుకోదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు