ఇన్నాళ్లూ యేడ దాచేసినావయ్యా చరణ్‌

 ఇన్నాళ్లూ యేడ దాచేసినావయ్యా చరణ్‌

రంగస్థలం చిత్రం నచ్చిందా నచ్చలేదా అనే దానిపై భిన్న స్వరాలున్నాయేమో కానీ చరణ్‌ నటన గురించి మాత్రం అందరిదీ ఒకే మాట. తన ఇమేజ్‌ని లెక్క చేయకుండా 'చెవిటి' పాత్ర చేయడానికి సిద్ధపడిపోయిన చరణ్‌ కేవలం ఆ పాత్రలో నటించడం కాకుండా 'చిట్టిబాబు'గా జీవించేసి తన పాత్ర చిరకాలం గుర్తుండిపోయేలా చేసాడు.

చిరుత, మగధీర, ఆరెంజ్‌ సినిమాల వరకు నటనలో మెప్పించినా ఆ తర్వాత చరణ్‌ మూస సినిమాలు చేస్తూ తన యాక్టింగ్‌ టాలెంట్‌ మరుగున పడేసాడు. గోవిందుడు అందరివాడేలే, ధృవ చిత్రాల్లో ఫర్వాలేదనిపించినా చరణ్‌కి అంత స్కోప్‌ ఇవ్వలేదు ఆ చిత్రాలు. చరణ్‌కి యాక్టింగ్‌ రాదంటూ యాంటీ ఫాన్స్‌ చేసే ట్రోలింగ్‌తో ఫాన్స్‌ ఫీలవుతోన్న సమయంలో చిట్టిబాబుగా పూనకం వచ్చినట్టు విజృంభించి తనలోని నటుడి డెప్త్‌ ఏంటనేది చూపించాడు.

ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎవరికైనా వచ్చే డౌట్‌ ఇదే.. 'ఇన్నాళ్లూ ఇంత నటన ఎక్కడ దాచేసావ్‌?' అని. కథలు, పాత్రల పరంగా ఛాలెంజ్‌లు స్వీకరిస్తోన్న చరణ్‌ రైట్‌ ట్రాక్‌లోకి వచ్చేసాడు. కమర్షియల్‌ మీటర్‌ వదలకుండా నటుడికి న్యాయం చేసే క్యారెక్టర్లు ఎంచుకుంటున్నాడు. ఇదే పద్ధతి ఫాలో అయితే మెగా ఫాన్స్‌ కలలు కంటోన్న ఆ పొజిషన్‌కి రావడం చరణ్‌కి కష్టమేం కాకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు