ఎన్టీఆర్.. అందుకే మనం ఆనందపడాలి

ఎన్టీఆర్.. అందుకే మనం ఆనందపడాలి

మ్యాథ్స్ జీనియస్ రామనాథన్.. అజారుద్దీన్.. అరుణాచలం మురుగనాథన్..వీరందరూ మన సౌత్ హీరోలే.  ఈ కథలన్నీ కూడా మన దక్షిణాది వారివే. కాని మన మీద సినిమాలన్నీ హిందీలో తీస్తుంటారు. అజార్ బయోపిక్ అయినా.. ప్యాడ్ మాన్ సినిమా అయినా.. బాలీవుడ్డోళ్ళే తీశారు. వాళ్ళు తీస్తే మనం చూసి వావ్ అనుకుంటాం. కాని మనం ఎప్పుడు అలాంటి ప్రయత్నం చేస్తాం? త్వరలోనే బాలీవుడ్లో కపిల్ దేవ్ మీద ఒక బయోపిక్ వస్తోంది.

కల్పనా చావ్లా మీద సినిమా వస్తోంది. మరి మనోళ్ళు ఎప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తారు? బాహుబలి వంటి గ్రాఫిక్స్ సినిమాలూ.. రంగస్థలం వంటి రివెంజ్ డ్రామాలు.. బాగానే ఉన్నాయ్.. కాని రియల్ లైఫ్‌ సినిమాలు కూడా తీయాలి కదా? తీసి మెప్పించాలి కదా? కాదంటారా?

అందుకే టాలీవుడ్ చేస్తున్న తొలిప్రయత్నంగా.. ప్రవీణ్‌ సత్తారు బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ కోచ్ పుళ్ళెళ్ళ గోపిచంద్ జీవితంపై తీసే సినిమా నిలుస్తుందని అనుకున్నాం. కాని ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇంతలో హటాత్తుగా 'ఎన్టీఆర్' బయోపిక్ అంటూ బాలయ్య ముందుకొచ్చాడు.

ఈ సినిమాను ఏదో ఎలక్షన్ల ముందు తీసే ప్రచారం చిత్రం అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నవేళ.. అసలు ఎన్టీఆర్ జీవిత కథను బాలీవుడ్లో ఏ హన్సల్ మెహతానో.. ప్రకాష్‌ ఝా వంటి డైరక్టర్లో సినిమాలు తీయకముందే.. లేదంటే గాంధి సినిమాను ఫారినర్ అయిన రిచర్డ్ అటెన్ బరో తీసినట్లు.. వేరే దేశం వారెవరో వచ్చి ఎన్టీఆర్ పై సినిమా తీస్తాం అనకముందే.. ఇక్కడ మన తెలుగోళ్ళే ఈ తెలుగు నేతపై సినిమా తీయడం మనం ఆనందపడాల్సిన విషయం. ఇది ముమ్మాటికీ సత్యం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు