హిందీ ‘క్షణం’.. టాక్ ఏంటి?

హిందీ ‘క్షణం’.. టాక్ ఏంటి?

గత కొన్నేళ్లలో దక్షిణాది సినిమాలు చాలానే బాలీవుడ్‌కు వెళ్లాయి. ఈ కోవలో తాజాగా తెలుగు నుంచి బాలీవుడ్ బాట పట్టిన సినిమా ‘క్షణం’. ఈ చిత్రం ఆధారంగా హిందీలో ‘బాగి-2’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే తెలుగులో వచ్చిన థ్రిల్లర్‌ మూవీస్‌లో వన్ ఆప్ ద బెస్ట్ అనిపించుకున్న ‘క్షణం’ హిందీలోకి వెళ్లేసరికి కిచిడీ అయిపోయింది.

కేవలం మూల కథ మాత్రమే తీసుకుని.. దీని ట్రీట్మెంట్ పూర్తిగా మార్చేసి కంగాళీ చేసిపడేశారు. ఈ చిత్రానికి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. కొన్ని ప్రముఖ వెబ్ సైట్లు 1-2 మధ్య రేటింగ్స్ ఇచ్చాయి. పేరుకు ‘క్షణం’ రీమేక్ కానీ.. అందులో ఆ ఛాయలు కనిపించింది చాలా తక్కువే. కథే ప్రధానంగా సాగే థ్రిల్లర్ మూవీని యాక్షన్ సినిమాగా మార్చేశారంటున్నారు. పూర్తిగా యాక్షన్‌తోనే నింపేయడంతో ఒరిజినల్‌లోని సోల్ పూర్తిగా మిస్సయిందని అంటున్నారు.

ఐతే ఈ చిత్రానికి వసూళ్ల విషయంలో మాత్రం ఢోకా లేదు. టైగర్ ష్రాఫ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి ఈ చిత్రానికి. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు దీటుగా ఇది తొలి రోజు వసూళ్లు రాబట్టింది. సమీక్షల సంగతెలా ఉన్నప్పటికీ దీనికి వసూళ్ల విషయంలో మాత్రం ఢోకా లేనట్లుంది. కమర్షియల్‌గా ఈ చిత్రం పెద్ద సక్సెస్సే అయ్యేలా కనిపిస్తోంది. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించిన ఈ చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించాడు. టైగర్ సరసన అతడి గర్ల్ ఫ్రెండ్ దిశా పఠాని ఇందులో కథానాయికగా నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు