శ్రుతి హాసన్ రేంజ్ అలా పడిపోయింది

శ్రుతి హాసన్ రేంజ్ అలా పడిపోయింది

హిందీలో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత తెలుగులో నటించి.. చివరగా తన మాతృభాష తమిళంలో సినిమాలు చేసింది శ్రుతి హాసన్. ఐతే ఎక్కడా ఆరంభంలో ఆమెకు మంచి ఫలితాలు దక్కలేదు. ఐతే ‘గబ్బర్ సింగ్’తో ఆమె సుడి తిరిగింది. ఆ తర్వాత మిగతా భాషల్లోనూ విజయాలందుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

ఐతే ఒక నాలుగైదేళ్లు హవా సాగించాక ఆమె ఉన్నట్లుండి డౌన్ అయిపోయింది. అవకాశాలు రాలేదా.. లేక ఆమే సినిమాలు తగ్గించుకుందా అన్నది తెలియదు కానీ.. మొత్తానికి గత ఏడాదిగా శ్రుతి హాసన్ అడ్రస్ లేదు. ఏ భాషలోనూ ఆమె సినిమా చేయట్లేదు. దీంతో ఇక కెరీర్ ముగిసిపోయినట్లే అని అంతా అనుకున్నారు.

ఐతే ఎట్టకేలకు శ్రుతి మళ్లీ ముఖానికి రంగేసుకోబోతోంది. తెలుగు.. తమిళంలో కాకుండా ఆమె హిందీలో సినిమా చేయబోతుండటం విశేషం. ఒకప్పుడు దర్శకుడిగా హవా సాగించి.. ఆ తర్వాత నటనకు పరిమితం అయిపోయిన మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో శ్రుతి నటించబోతోంది. దర్శకుడిగా వరుస ఫ్లాపులు ఎదురవడంతో మహేష్ మెగా ఫోన్ పట్టట్లేదు. అతను ఇప్పుడు మళ్లీ దర్శకుడిగా సినిమా తీస్తూ శ్రుతి హాసన్‌ను కథానాయికగా ఎంచుకున్నాడు.

తెలుగులో విలన్ పాత్రలు చేసి.. హిందీలో ‘కమాండో’ సినిమాతో హీరోగా పర్వాలేదనిపించిన విద్యుత్ జమాల్ ఇందులో హీరోగా నటించనున్నాడు. ఐతే ఇంత కాలం వెయిట్ చేసి మహేష్-విద్యుత్ లాంటి కాంబినేషన్లో సినిమాను ఎంచుకోవడంతో శ్రుతి రేంజ్ బాగా పడిపోయిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు