న‌య‌న్ పై మండిప‌డ్డ నిర్మాత‌లు!

న‌య‌న్ పై మండిప‌డ్డ నిర్మాత‌లు!

కొద్ది రోజులుగా త‌మిళ‌నాడులో థియేట‌ర్ల యాజ‌మాన్యానికి, త‌మిళ్ ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ (టీపీఎఫ్ సీ)కు మ‌ధ్య వివాదం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో, త‌మిళ‌నాడులో నెల రోజుల నుంచి కొత్త సినిమాల విడుద‌లను టీపీఎఫ్ సీ నిలిపివేసింది.

థియేట‌ర్ల యాజ‌మాన్యం త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కు అధ్య‌క్షుడు స‌మ్మెను విర‌మించేది లేద‌ని టీపీఎఫ్ సీ అధ్య‌క్షుడు విశాల్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో న‌య‌న‌తార న‌టించిన మ‌ల‌యాళ చిత్రం 'పుదియ నియమమ్`ను నిర్మాత‌లు త‌మిళంలో డ‌బ్ చేసి విడుద‌ల చేశారు. 'వాసుకి' పేరుతో తమిళంలోకి అనువదించిన ఆ సినిమా గురువారం నాడు త‌మిళనాడులో విడుద‌ల కావ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

బంద్ నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో కొత్త సినిమాలు విడుదల చేయకూడద‌న్న నిబంధ‌న‌ను తుంగ‌లో తొక్కి న‌య‌న‌తార సినిమా విడుద‌ల కావ‌డంపై కొంత‌మంది నిర్మాత‌లు....న‌య‌న‌తార‌పై మండిప‌డ్డారు. మిగ‌తా సినిమాల‌కు ఒక న్యాయం....నయనతారకు మాత్రం ఒక న్యాయం ఏమిట‌ని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా, చెన్నైలో నయన్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. వారి వ్యాఖ్య‌ల‌పై నయనతార స్పందించింది.

ఈ సినిమా విడుదలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. తమిళంలో ఆ సినిమాను విడుదల చేసిందెవ‌రో కూడా త‌న‌కు తెలీద‌ని వాపోయింది. కేవలం మ‌ల‌యాళంలో ఆ సినిమాలో నటించిన కార‌ణంగా ....త‌మిళంలో ఆ చిత్ర విడుద‌ల‌కు త‌న‌ను బాధ్యురాలిని చేయ‌డం ఏమిట‌ని న‌య‌న్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు