క్లాస్‌ సినిమాతో డేర్‌ చెయ్యలేకనే...

క్లాస్‌ సినిమాతో డేర్‌ చెయ్యలేకనే...

కొంతమంది హీరోలు క్లాస్‌ సినిమాలు చెయ్యాలంటే కాస్త జంకుతారు. అదే కెరియర్‌లోనే తొలి మూవి అయితే ఈ విషయంలో కాస్త డేర్‌ చెయ్యొచ్చు. కాని ఒక్కసారి క్లాస్‌ ఫిలిం చేస్తే ఇక అదే ముద్రపడిపోతుంది. అందుకేనేమో త్వరలో తెరంగేట్రం చెయ్యన్ను మెగా హీరో వరుణ్‌ తేజ్‌ను అలాంటి సినిమా చెయ్యొద్దని పెద్దలు సలహాఇచ్చారట. అందుకే సీతమ్మవాకిట్లో సిరిమల్లిచెట్టు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలతో చేద్దామనుకున్న 'గొల్లభామ' సినిమాను వెనక్కినెట్టేశారట.

వరుణ్‌ తేజ్‌ను ఈ సినిమాతో తెరంగేట్రం చేయించాలని ముందుగా తలచిన నాగబాబు, చివరకు మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక అన్నయ్య కొడుకు చరణ్‌ను లాంచ్‌ చేసిన డ్యాషింగ్‌ దర్శకుడు పూరి జగన్‌ను పట్టుకున్నాడట నాగబాబు. ఎట్టిపరిస్థితుల్లో తన కొడుకుని ఒక మాస్‌ యాక్షన్‌ కమర్షియల్‌ హీరోగా లాంచ్‌ చేయాలని పట్టుబట్టాడట. మరి నాగబాబు కోరికను మన్నించి పూరి జగన్‌ ఈ కొత్త మెగా హీరోతో సినిమా చేస్తాడో లేదో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English