అఖిల్‌, నాగార్జున పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌

అఖిల్‌, నాగార్జున పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌

అఖిల్‌తో సినిమా తీస్తున్నట్టు రాంగోపాల్‌వర్మ అయితే ప్రకటించేసాడు కానీ ఇంతవరకు నాగార్జున దీని గురించి ఒక్క కామెంట్‌ కూడా చేయలేదు. అఖిల్‌ కూడా తనకేమీ తెలీదన్నట్టే సైలెంట్‌గా వుండిపోయాడు. అభిమానుల్లో మాత్రం కలకలం రేపిన ఈ వార్త వర్మ అత్యుత్సాహంతో ఇచ్చినదా లేక నాగార్జునని ఇరకాటంలో పడేయడానికి ఇచ్చినదా అనేది తెలీడం లేదు.

వర్మకి సినిమాలు ప్రకటించడం, వాటిలో చాలా వాటిని తీయకపోవడం అలవాటే. ప్రస్తుత పరిస్థితుల్లో వర్మతో అఖిల్‌ సినిమా వుండదనే సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆఫీసర్‌ చిత్రం అంచనాలని మించి ఆడేసి వర్మకి పూర్వ వైభవం తెస్తే కనుక ఈ చిత్రం వుండొచ్చు కానీ లేదంటే నాగార్జున కూడా అంతటి దుస్సాహసం చేయడనే భావిస్తున్నారు.

వర్మ ఎన్ని చెప్పినా నాగ్‌ సైలెంట్‌గా వుండడంతో అభిమానులకి ఊరటగా వుంది. ప్రస్తుతం చేస్తోన్న సినిమాకి క్రేజ్‌ పెంచడం కోసం వెంటనే మరో సినిమా చేయబోతున్నామని చెప్పడం ఇండస్ట్రీలో రెగ్యులర్‌ టాక్టిక్‌. ప్రస్తుతానికి వర్మ అనౌన్స్‌మెంట్‌ని ఆఫీసర్‌ సేల్స్‌ కోసం చేసినదేగానే పరిగణిస్తున్నారు. ఇప్పుడు వర్మతో తను చేస్తుంటేనే వచ్చిన రియాక్షన్స్‌ ఏమిటో తెలిసిన నాగ్‌ చూస్తూ చూస్తూ ఎదుగుతోన్న కొడుకు కెరియర్‌ని ప్రశ్నార్ధకం చేసే నిర్ణయం తీసుకోడనే భావించవచ్చు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు