సిల్లీగా సొల్లు కబుర్లేందమ్మా ఇల్లీ!!

సిల్లీగా సొల్లు కబుర్లేందమ్మా ఇల్లీ!!

టాలీవుడ్‌లో స్టార్ కిరీటాన్ని కాద‌నుకుని, బాలీవుడ్‌లో చిన్న చిన్న అవ‌కాశాల కోసం ఆశ‌గా ఎదురుచూస్తోంది ఇలియానా.  బాలీవుడ్‌కి వెళ్లాక సినిమాల కంటే కూడా బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ, సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్టుల కార‌ణంగానే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోందీ గోవా బ్యూటీ. అయితే నాపైన గాసిప్స్ వ‌స్తే, నాకు చాలా భ‌యం! అంటూ సిల్లీ క‌బుర్లు చెబుతోందీ చిన్న‌ది.

బాలీవుడ్ బాట ప‌ట్టాక వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు చేస్తూ, ఆ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేస్తోంది ఇలియానా. ఓ సారి బికినీ వేసుకుని, స‌ముద్రంలో జ‌ల‌కాలాడుతూ బ‌క్క‌చిక్కిన బాడీని మొత్తం ప్ర‌ద‌ర్శించింది. ఆ త‌ర్వాత బాత్ ట‌బ్బులో న‌గ్నంగా కూర్చొని ఫోటోల‌కి స్టిల్ ఇచ్చింది. వీట‌న్నింటినీ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నోబోనే తీశాడంటూ గ‌ర్వంగా ప్ర‌క‌టించుకుంది కూడా. ఈ మ‌ధ్య‌నే బాయ్‌ఫ్రెండ్‌ను ‘బెస్ట్ హాస్బెండ్ ఎవ‌ర్‌’ అంటూ సంభోదించి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఆ విష‌యం గురించి అడిగితే... ‘‘గాసిప్స్ కాల‌మ్‌లో నా గురించి వార్త‌లు ఉండ‌డం నాకు అస్స‌లు న‌చ్చ‌దు. నా వ్య‌క్తిగ‌త‌మైన విష‌యాలు వార్త‌లుగా అంద‌రితో పంచుకోవ‌డ‌మంటే నాకెంతో భ‌యం కూడా...’’ అంటూ చెబుతోంది.

నిజంగా గాసిప్స్ అంటే అంత భయం ఉన్నప్పుడు.. సోష‌ల్ మీడియాలో అంద‌రికీ తెలిసేలా ప‌ర్స‌న‌ల్ విష‌యాలు పంచుకోవ‌డం ఎందుకు ఇల్లీ!? ర‌హ‌స్యంగా వ్య‌క్తిగ‌త జీవితం కోరుకుంటే, ర‌హ‌స్యంగానే బ‌త‌కొచ్చు క‌దా! ప‌ర్స‌న‌ల్ ఫోటోలు, ప‌ర్స‌న‌ల్ ఫీలింగ్స్ పోస్టు చేయ‌మ‌ని ఎవ‌రైనా బెదిరించారంటారా? సిల్లీగా సొల్లు కబుర్లేందమ్మా ఇల్లీ!!


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు