పవన్ ఉండడు.. ఉన్నట్లే ఉంటాడు

పవన్ ఉండడు.. ఉన్నట్లే ఉంటాడు

టాలీవుడ్లో ఒకప్పుడు అందరి కళ్లూ మెగాస్టార్ చిరంజీవి మీదే ఉండేవి. వేరే సినిమాల్లో ఆయన రెఫరెన్సులు కనిపించేవి. ఆయన సినిమా నుంచి విరామం తీసుకున్నాక ఈ తరహా రెఫరెన్సులు పవన్ కళ్యాణ్‌ విషయంలో ఎక్కువయ్యాయి. చాలామంది యంగ్ హీరోలు పవన్ పేరును సినిమాల్లో వాడుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయంలో అగ్ర తాంబూలం నితిన్‌కే ఇవ్వాలి.

గత కొన్నేళ్లుగా అతను తన ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఓ చోట పవన్ రెఫరెన్స్ వాడుతూనే ఉన్నాడు. తన కొత్త సినిమా ‘చల్ మోహన్ రంగ’లోనూ నితిన్‌.. పవన్‌ను బాగానే వాడేసినట్లున్నాడు. ఈ చిత్రానికి పవన్ నిర్మాత కూడా అన్న సంగతి తెలిసిందే.

‘చల్ మోహన్ రంగ’లో పవన్ చిన్న అతిథి పాత్ర చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమే నితిన్ దగ్గర ప్రస్తావిస్తే అది అబద్ధమన్నాడు. ఐతే ఈ సినిమాలో పవన్ లేడు కానీ.. ఉన్నట్లే అనిపిస్తాడని.. అదెలా అన్నది సినిమా చూసే తెలుసుకోవాలని నితిన్ అన్నాడు. నితిన్ ఇలా అన్నాడటంటే ‘అష్టాచెమ్మా’లో మహేష్ పేరును వాడేసినట్లు ఇందులో పవన్ పేరును నితిన్ వాడేశాడేమో అనుకుంటున్నారు.

ఇక పవన్ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడు కావడం గురించి నితిన్ స్పందిస్తూ.. ‘‘నిజానికి ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ గారు.. నేను కలిసి నిర్మించాల్సింది. ఆయన కథ ఇచ్చాక నిర్మాత కావడానికి కూడా అంగీకరించారు. ఈ విషయం పవన్ గారికి చెబితే.. మీరు చేస్తానంటే నేను కూడా మీతో ఉంటాను అని ప్రొడక్షన్లోకి వచ్చారు’’ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు