యామీ పోల్ డ్యాన్స్ ఆడుతోంది

యామీ పోల్ డ్యాన్స్ ఆడుతోంది

యాక్ట్రెస్ గా కంటే మోడల్ గా మన అందరికీ ముందే తెలిసిన సుందరాంగి యామీ గౌతమ్.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. నువ్విలా.. గౌరవం వంటి చిత్రాల తర్వాత చివరగా తెలుగులో కొరియర్ బాయ్ కళ్యాణ్ అంటూ నితిన్ చేసిన మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీ ఇప్పుడు సడెన్ గా పోల్ డ్యాన్స్ చేసేస్తోంది.

చిట్టి పొట్టి బట్టలు వేసుకుని యామీ పోల్ డ్యాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. పోల్ డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరిక ఈ బ్యూటీకి సడెన్ గా కలిగిందట. అంతే.. వెంటనే సెలబ్రిటీ టీచర్ ఆరిఫ్ భిందర్వాలా దగ్గర చేరిపోయి.. డ్యాన్సింగ్ క్లాసులు అటెండ్ అయిపోతోంది. ఇప్పటికి అయితే ఇంకా పర్ఫెక్ట్ అయిపోయానని చెప్పడం లేదు కానీ.. పోల్ ను పట్టుకుని వేళ్లాడుతూ డ్యాన్స్ చేస్తుంటే మాత్రం మహా థ్రిల్లింగ్ గా ఉందని చెబుతోంది యామీ గౌతమ్. పోల్ డ్యాన్సింగ్ తేలికైన విషయం కాదంటున్న ఈ భామ.. అందుకోసం ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుందని చెబుతోంది.

అయితే.. ఫిట్నెస్ లెవెల్స్ ను పెంచుకునేందుకు పోల్ డ్యాన్సింగ్ బెస్ట్ ఆప్షన్ అంటోంది యామీ. ఇప్పటివరకూ చేసిన వాటితో పోల్చితే ఏదైనా వైవిధ్యంగా.. కష్టంగా అనిపించే అంశాన్ని నేర్చుకోవాలని అనిపించడంతోనే పోల్ డ్యాన్సింగ్ నేర్చుకుంటున్నానని.. అంతే తప్ప ఎవరూ దీనికి స్ఫూర్తి కాదని.. ఏ సినిమా కోసం కాదని చెబుతోంది యామీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు