గురూజీ డైరక్షన్లో ఎన్టీఆర్ క్రికెట్ యాడ్

గురూజీ డైరక్షన్లో ఎన్టీఆర్ క్రికెట్ యాడ్

యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉన్నాడు తార‌క్‌. ఇంత‌లో స్టార్ యాజ‌మాన్యం నుంచి ఐపీఎల్ తెలుగు ప్ర‌సారాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌డ‌మే ఆహ్వానం అందింది. దేశ‌వ్యాప్తంగా క్రేజ్ ఉన్న పొట్టి ఫార్మాట్ క్రికెట్ కి తెలుగులో బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండే అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం ఇష్టంలేని తార‌క్ ఒకే చెప్పేశాడు కూడా.

ఇప్పుడు ఈ యాడ్ ద‌ర్శ‌క‌త్వం చేసే బాధ్య‌త కూడా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కే అప్ప‌గించింది స్టార్ గ్రూప్‌. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కు ఇప్ప‌టికే ప‌లు బ్రాండ్‌ల యాడ్‌లకు ద‌ర్శ‌క‌త్వం చేసిన అనుభ‌వం ఉంది. రామ్‌చ‌ర‌ణ్‌, ఎమ్‌.ఎస్‌. ధోని న‌టించిన పెప్సీ యాడ్‌, త‌మ‌న్నా, విరాట్ కోహ్లీ న‌టించిన సెల్కాన్ మొబైల్ యాడ్, మ‌హేష్‌బాబు న‌టించిన సంతూర్ సోప్ ప్ర‌క‌ట‌న‌ల‌కు ద‌ర్శ‌క‌త్వం చేసింది మాట‌ల మాంత్రికుడే. తార‌క్ న‌టించిన ఇమామీ న‌వ‌ర‌త్న తైలం యాడ్‌ను డైరెక్ట్ చేసింది కూడా గూరూజీనే. అందుకే ఐపీఎల్ యాడ్స్‌కు కూడా త్రివిక్ర‌మ్‌నే సంప్ర‌దించింది స్టార్ యాజ‌మాన్యం. ఈ ప్ర‌క‌ట‌న‌ల కోసం యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్‌కు భారీ రేటు ఆఫ‌ర్ చేసిన స్టార్‌ వారు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కి కూడా భారీ మొత్తాన్నే ఆఫ‌ర్ చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా త్రివిక్ర‌మ్‌, ఎన్‌టీఆర్ కాంబినేష‌న్లో రూపొంద‌బోతున్న సినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ఏప్రిల్ 12 నుంచి మొద‌లుకానుంది. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా న్యూ లుక్ ట్రై చేస్తున్న తార‌క్‌, దాన్ని రివిల్ చేయ‌డం ఇష్టం లేక అన్న క‌ల్యాణ్‌రామ్ ఎమ్మెల్యే ఫంక్ష‌న్‌కి కూడా రాలేదు. ఇప్పుడు ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో ఎలా న‌టిస్తార‌నే ఆస‌క్తిక‌రంగా మారింది. ఏప్రిల్ 6న ఐపీఎల్ ప్రారంభం కానుంది. అంటే ఆ రోజుకి ముందే యాడ్స్ రావాలి. మ‌రి సినిమా కోసం చేసిన ఎన్‌టీఆర్‌ కొత్త లుక్ ముందుగానే ప్రేక్ష‌కుల‌కు యాడ్స్ రూపంలో ప‌రిచ‌యం కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు