ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడేందబ్బా!?

ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడేందబ్బా!?

టాలీవుడ్ సినిమాల్లో పక్క భాషల నటులకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. దీన్ని క్రేజ్ ఉన్నంత క్యాష్ చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలనే చేస్తారు ఆయా నటులు. మలయాళంలో మాంచి ఇమేజ్ ఉన్న హీరో డల్కర్ సల్మాన్.. గత కొంత కాలంగా హైద్రాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నాడు. నిజానికి ఇతడు మహానటి మూవీలో తను పోషించిన జెమినీ గణేశన్ పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం కోసమే హైద్రాబాద్ లో ఉంటున్నా.. ఇతర పనులను కూడా బాగానే చక్కబెట్టేసుకుంటున్నాడు.

రీసెంట్ గా అఖిల్ మూడో సినిమాకి ముహూర్తం షాట్ తీస్తే.. అక్కడ మెరిశాడు డల్కర్. ఏదో ఫ్రెండ్ షిప్ కొద్దీ వచ్చాడులే అందరూ అనుకుంటే.. ఇప్పుడు రామ్ చరణ్ ఇంకా పెద్ద షాక్ ఇచ్చాడు. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు మెగా పవర్ స్టార్ ని కలవగా.. వీరిలో డల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు. ఇతడితో దిగిన ఫోటోను చెర్రీనే పోస్ట్ చేయడం విశేషం. ఆ తర్వాత చరణ్ అండ్ టీం  ఓ పార్టీ ఇస్తే.. అక్కడ కూడా డల్కర్ కనిపించాడు.

నిజానికి టాలీవుడ్ సినిమాల్లో ఇతర భాషా నటులకు పేమెంట్స్ గట్టిగా ఉంటాయి. తమ భాషల్లో అంత పెద్ద మొత్తం గిట్టుబాటు కావడం కష్టమైన విషయం. అందుకే ఇప్పుడు నాగార్జున.. చిరంజీవి టీంలకు బాగా చేరువ అయిపోతూ.. వారి సినిమాల్లో నటించేందుకు తనకేం అభ్యంతరం లేదంటూ హింట్స్ ఇస్తున్నాడు డల్కర్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే.. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి.. డల్కర్ తండ్రి మమ్ముట్టి కూడా స్నేహితులు కావడంతోనే.. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు