బన్నీ-నాని తప్ప అందరికీ కావాల్సిందే

బన్నీ-నాని తప్ప అందరికీ కావాల్సిందే

ఏ సమ్మర్ లోను కనిపించనంత వేడి ఈసారి టాలీవుడ్ లో కనిపిస్తోంది. ప్రతీ వారం సినిమాలు క్యూ కట్టేశాయి. మార్చ్ 30న రంగస్థలంతో ప్రారంభిస్తే.. మే చివరలో వచ్చే నాగార్జున ఆఫీసర్ వరకూ చాలానే మూవీస్ వస్తున్నాయి.

ఏప్రిల్ 5న నితిన్ ఛల్ మోహనరంగ.. ఏప్రిల్ 3న నాని కృష్ణార్జున యుద్ధం.. ఏప్రిల్ 20న భరత్ అనే నేను.. ఏప్రిల్ 27న రజినీకాంత్ కాలా.. మే 4న బన్నీ మూవీ నా పేరు సూర్య.. మే 9న కీర్తి సురేష్-సమంతల మహానటి.. మే 11న ఆకాష్ పూరీ మెహబూబా.. అదే రోజున రాజ్ తరుణ్ మూవీ రాజుగాడు.. మే 12న బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం.. గోపీచంద్ పంతం.. మే 18న విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా.. మే 24న రవితేజ నేల టిక్కెట్టు.. మే 25న కళ్యాణ్ రామ్ నా నువ్వే.. అదే డేట్ నాడు నాగ్ ఆఫీసర్ రిలీజ్ అవుతున్నాయి.

ఈ లిస్టంతా చూస్తే.. బన్నీ అండ్ నాని మాత్రమే హిట్ కొట్టి సక్సెస్ ఊపులో ఉన్నారనే విషయం అర్ధమవుతుంది. రామ్ చరణ్ కూడా ధృవ మూవీతో సక్సెస్ కొట్టినా.. అది బ్లాక్ బస్టర్ కాదు. అల్లు అర్జున్ అండ్ నానిలు మాత్రమే బ్లాక్ బస్టర్స్ సాధించి ఊపు మీద ఉన్నారు. మిగతా హీరోలంతా సక్సెస్ కోసం ఎడారిలో థమ్సప్ కోసం వెయిట్ చేసే మహేష్‌ బాబులా వెయిట్ చేస్తున్నారు.

లై మూవీతో నితిన్.. బ్రహ్మోత్సవం-స్పైడర్ లతో మహేష్ బాబు.. లింగా దెబ్బతో రజినీకాంత్.. రాజ్ తరుణ్ మూవీ రంగుల రాట్నం.. విజయ్ దేవరకొండ ఏ మంత్రం వేశావే.. కళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ.. నాగార్జున రాజు గారి గది వంటి చిత్రాలతో పాటు గోపీచంద్ గౌతమ్ నంద-ఆక్సిజన్ కూడా మహా ప్లాపుల కేటగిరిలో ఉన్నాయి. వీరిలో ఒక్క విజయ్ దేవరకొండ ఫ్లాప్ ను మాత్రమే ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English