పవన్ భజన చేసి హీరో అయిపోయాడు

పవన్ భజన చేసి హీరో అయిపోయాడు

మన ఇండియాకి.. యూరోప్ లో ఉన్న పోలండ్ మధ్య 6వేల కిలోమీటర్ల దూరం ఉంది. గతంలో అయితే చాలా దూరమేమో కానీ.. సోషల్ మీడియా పుణ్యమా అని.. పోలండ్ కు చెందిన ఓ కుర్రాడు మన తెలుగోళ్లకు కూడా బాగా తెలిసిపోయాడు.

జిబిగ్స్ బుజ్జి అంటే తెలుగు జనాలకు బాగానే తెలుసు. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకు అయితే మరీ దగ్గర అయిపోయాడు కూడా. ఈ బుజ్జికి ఇంత క్రేజ్ రావడానికి కారణం.. తెలుగు పాటలను ఇతడు పోలండ్ స్లాంగ్ లో తడుముకోకుండా పాడేస్తూ ఉండడమే. పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ ఇస్తున్నా అంటూ.. 'కొడకా కోటేశ్వరరావా' పాటను ఫుల్లుగా పాడేశాడు కూడా. పవన్ నుంచి కూడా అభినందనలు అందుకున్న ఈ జిబిగ్స్ బుజ్జి.. ఇప్పుడు ఓ తెలుగు సినిమా హీరో అయిపోతున్నాడు. పాపం పసివాడు అనే టైటిల్ పై సినిమా రూపొందనుండగా.. డార్క్ థీమ్ తో రూపొందించిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.

సత్యదేవ్ జంగా రచనలో పాపం పసివాడు రూపొందుతుంది అని తప్పిస్తే.. ఇప్పటికి మరే వివరాలను ప్రకటించలేదు. త్వరలోనే మరిన్ని డీటైల్స్ చెబుతామని పోస్టర్ లో వేశారు. పోలండ్ కుర్రాడికి పవన్ కళ్యాణ్ తెచ్చిన క్రేజ్.. ఓ తెలుగు సినిమాకు లీడ్ రోల్ చేసే ఆఫర్ తెచ్చిపెట్టేసింది. పవన్ పేరు చెప్పుకుని హీరో అయిపోయేందుకు ఈ పోలండ్ బుజ్జి కూడా రెడి అయిపోయాడు. మరి మేకర్స్ వేసిన ఈ ఆలోచన ఏ మాత్రం క్లిక్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు