రకుల్ స్వీట్ పెయిన్ విన్నారా?

రకుల్ స్వీట్ పెయిన్ విన్నారా?

టాలీవురకుల్ స్వీట్ పెయిన్ విన్నారా?డ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ స్వింగ్ తో టాప్ లీగ్ లోకి వచ్చేసింది. అక్కడి వరకూ వచ్చిన తర్వాత స్పైడర్ అంటూ బ్రేక్ పడ్డంతో అమ్మడు ఇంకా స్టార్ అనిపించుకోలేకపోయింది కానీ.. ఆ స్థాయికి రకుల్ రేంజ్ తక్కువ అయితే మాత్రం కాదు. ఇంతగా తన స్థాయిని చకచకా పెంచుకోవడానికి కారణం.. అటు నటనలోను.. ఇటు తన ఫిట్నెస్ విషయంలోనూ బాగా కమిట్మెంట్ చూపించడమే.

జిమ్ లో వర్కవుట్స్ దాదాపు అందరు తారలు చేస్తూనే ఉంటారు. కానీ ఇది ఓ మొక్కుబాటు విషయంగానే పరిగణిస్తారు తప్ప.. అందులో ఎంజాయ్మెంట్ ను వెతుక్కోలేరు. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అలా కాదు. జిమ్ లో గడపడాన్ని తెగ ఎంజాయ్ చేస్తుంది రకుల్ ప్రీత్. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ చిన్న వీడియో చూస్తే.. జిమ్ లో రకుల్ ఎంతగా కష్టపడుతుందో అర్ధమవుతుంది. కేవలం వెయిట్ పెరగకుండా ఉండేందుకు.. లేదా తన ఫిజిక్ ని కాపాడుకోవడానికి అయితే ఇంతగా కష్టపడాల్సిన పని లేదు.

అసలు ఇదో స్వీట్ పెయిన్ అంటోంది రకుల్ ప్రీత్. చాలా తక్కువ మంది మాత్రమే ఆ స్వీట్ పెయిన్ ను అర్ధం చేసుకుంటారని.. తాను ఇవాళ ఆ బాధ ఏంటో తెలుసుకున్నానని చెప్పింది రకుల్. నిజంగా రకుల్ మోసిన బరువులు చూస్తే అందరి గుండెలు జారిపోవాల్సిందే. ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్ మూవీ కోసం షార్ట్ స్పాన్ లో 9 కిలోల బరువు తగ్గిపోవాలట. అందుకే ఇంత కష్టపడిపోతోంది రకుల్ ప్రీత్ సింగ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English