రాజమౌళికి ఇదేం సరదా!

రాజమౌళికి ఇదేం సరదా!

ఎంత టాప్‌ డైరెక్టర్‌ అయినా ఒక్కోసారి అదో రకం మోజులో పడిపోవడం ఖాయమని ఈ వార్త చెబుతోంది. బాహుబలి సినిమాతో భారతీయ సినీ చరిత్రనే తిరగరాసిన రాజమౌళి ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై కసరత్తు చేస్తున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌... అంటూ రాజమౌళి, రామారావు, రామ్‌ చరణ్‌ పేర్లు కలిసి వచ్చేలా ప్లాన్‌ చేసారు.

ఇంతవరకు బాగానే వుంది కానీ మిగతా తారాగణం కూడా ఆర్‌తో వుండేవాళ్లు వుండాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నాడనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. హీరోయిన్ల పేర్లు కూడా ఆర్‌తో వచ్చేలా వుంటే బాగుంటుందని రకుల్‌, రాశి ఖన్నాలని తీసుకునే ఆలోచనలో వున్నాడని, అలాగే విలన్‌గా రాజశేఖర్‌ పేరు పరిశీలనలో వుందని ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎక్సయిటింగ్‌గా కాకుండా జోక్‌లా వుండడంతో దీనిపై ఫన్సీ కామెంట్స్‌ పడుతున్నాయి.

ఇది కేవలం ప్రచారమేనా లేక నిజంగానే రాజమౌళి ఆర్‌ మాయలో పడిపోయి దానిని మరీ సీరియస్‌గా తీసుకున్నాడా అనేది మిగతా తారాగణం అనౌన్స్‌ అయితే తెలుస్తుంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇంతవరకు హీరోలిద్దరికీ చెప్పలేదు. అక్టోబర్‌లో షూటింగ్‌ మొదలయ్యే ఈ చిత్రం ఏడాదికి పైగా చిత్రీకరణ జరుపుకుంటుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు