సాయిపల్లవి సోలో సాహసం

సాయిపల్లవి సోలో సాహసం

ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’. ఈ చిత్రంతో వేణు ఉడుగుల అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. దర్శకుడిగా అనుభవం లేకపోయినా.. ప్రతి కుటుంబానికీ కనెక్టయ్యే ఒక సమస్యను లోతుగా.. పరిణతితో చర్చించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు వేణు.

ఈ చిత్రంలో లోపాలు లేవని కాదు కానీ.. వాటిని మరిపించే మంచి అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. అందుకే ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమాతో ఇండస్ట్రీ జనాల దృష్టిని బాగానే ఆకర్షించాడు వేణు. అతడికి వెంటనే అవకాశాలు కూడా వస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఒక నిర్మాతకు వేణు కమిట్మెంట్ కూడా ఇచ్చాడట.

సాయిపల్లవి ప్రధాన పాత్రలో వేణు ఉడుగుల తన రెండో సినిమాను తీయబోతున్నట్లు సమాచారం. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కబోయే సినిమా అట. ఈ స్క్రిప్టును చాన్నాళ్ల ముందే సిద్ధం చేశాడట వేణు. ‘నీదీ నాదీ కథ’ విడుదల కాగానే సాయిపల్లవికి ఈ కథ చెప్పి ఒప్పించాడట. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

మంచి నటిగా చాలా త్వరగా గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి.. తొలి సినిమాతోనే దర్శకుడిగా విలక్షణతను చాటుకున్న వేణు కాంబినేషన్లో ఓ మంచి సినిమానే ఆశించొచ్చు. తెలుగులో ‘ఫిదా’.. ‘ఎంసీఏ’ సినిమాలతో మంచి విజయాలందుకున్న సాయిపల్లవి.. త్వరలోనే ‘కణం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా దాదాపు లేడీ ఓరియెంటెడ్ సినిమానే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English