'కలువ'ను పెంచుతున్న కోన

 'కలువ'ను పెంచుతున్న కోన

ఆంట్రప్రెన్యూర్ గా మారడం ఇప్పుడు చాలామంది మదిలో ఉంటున్న ఆలోచన. దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురావడం అందరూ చేయలేరు. చేసే అవకాశం వచ్చినపుడు దాన్ని వదులుకునేందుకు ఇష్టపడరు. ఓ రంగంలో తమకు ఉన్న ప్రావీణ్యాన్ని వ్యాపారంగా మలచుకోవాలని భావించడం సహజమే.

టాలీవుడ్ జనాలకు నీరజ కోన బాగా పరిచయం అయిన పేరే. గతంలో స్టార్ రైటర్ అనిపించుకున్న కోన వెంకట్ సిస్టర్ గా.. సెలబ్రిటీ స్టైలిస్ట్ గా ఈమె బాగా ఫేమస్. ముఖ్యంగా సమంతకు స్టయిలింగ్ చేస్తూ పాపులర్ అయిన స్టైలిస్ట్ ఈమె. పలువురు అందాల భామలతో ఫోటోలు దిగడం.. నీరజ కోన డిజైనింగ్ లో దిగిన డ్రెస్సులతో ఫోటోలు దిగి ఆయా తారలు ఈమెను  ప్రమోట్ చేయడం వంటివి ఇప్పటివరకూ కనిపించాయి. ఇప్పుడీమె ఓ సొంత బ్రాండ్ ను ప్ర్రారంభిస్తోంది. తన బ్రాండ్ కు 'కలువ' అంటూ అచ్చ తెలుగు పేరును పెట్టుకుంది ఈ అప్ కమింగ్ ఆంట్రప్రెన్యూర్.

సెలబ్రిటీ స్టైలిస్ట్ కదా అని.. ఆ రేంజ్ డిజైనింగ్ నే టార్గెట్ గా పెట్టుకోలేదు. రోజు వారీగా వేసుకునే రెడీమేడ్ డ్రెస్సులనే డిజైనర్ డ్రెస్సులుగా మలచాలన్నది ఈమె థాట్. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ బ్రాండ్ దుస్తులను మార్కెట్లోకి తెచ్చేందుకు ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని.. ఎంతో సంతోషంగా ఉందని చెబుతోంది నీరజ కోన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English