మెగా మీటర్‌ విడిచి పెట్టడట

మెగా మీటర్‌ విడిచి పెట్టడట

సుకుమార్‌తో సినిమా అనేసరికి ప్రయోగాత్మకంగా వుంటుందని అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు. కానీ రంగస్థలం చూస్తే ఊర మాస్‌ సినిమాని తలపిస్తోంది. తాజాగా విడుదలైన 'జిగేలు రాణి' వీడియో ప్రోమోలో చరణ్‌ డాన్సులు చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. సుకుమార్‌ సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ మామూలే అయినా కానీ ఇంత నాటుగా అతని పాటలెప్పుడూ లేవు.

అచ్చమైన పల్లెటూరి కథతో, అక్కడి పాత్రలతో రూపొందించిన ఈ చిత్రం అడుగడుగునా నేటివిటీ  హైలైట్‌ అవుతోంది. సుకుమార్‌ చిత్రం కనుక అవార్డులు తెచ్చిపెట్టేలా వుంటుందని, కమర్షియల్‌ అంశాలు వుండవని మీడియాలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది. కానీ చరణ్‌ మాత్రం ఈ చిత్రంలో కమర్షియల్‌ మసాలాలు ఫుల్‌గా వుంటాయని స్పష్టం చేసాడు. కథల ఎంపిక పరంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని, ప్రతి కథలోను కొత్తదనం వుండేట్టు చూసుకుంటున్నానని, అదే సమయంలో ఏదీ ప్రయోగాత్మకంగా లేకుండా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో మీటర్‌లో వుండేలా జాగ్రత్త పడుతున్నానని చెప్పాడు.

బోయపాటి శ్రీను సినిమాలోను ఒక కొత్త పాయింట్‌ వుంటుందట. అదే సమయంలో ఫాన్స్‌, మాస్‌ కోరుకునే అన్ని అంశాలు మేళవింపుగా వుంటుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు