సమంతని అస్సలు వాడుకోలేదేంటి?

సమంతని అస్సలు వాడుకోలేదేంటి?

సమంతకి ఇప్పుడు స్టార్‌ హీరోలకి సమానంగా ప్రేక్షకులని థియేటర్లకి రాబట్టే సత్తా ఉంది. ముఖం తెలియని హీరోతో ఆమె చేసినా కానీ తప్పకుండా ఓపెనింగ్స్‌ వస్తాయి. సమంత ఫాన్‌ బేస్‌ ఆ రేంజ్‌లో ఉంది మరి. సమంత ఉంటే మహేష్‌, పవన్‌ సినిమాలకి కూడా ఎస్సెట్‌ అవుతుందని భావించి, ఆమెనే తీసుకుంటున్నారు. అలాంటి సమంత తమ సినిమాలో ఉన్నప్పుడు ఆమెని పబ్లిసిటీ కోసం ఎంతగా వాడుకోవాలి? అదేమిటో కానీ 'ఆటోనగర్‌ సూర్య' చిత్రానికి సమంతని అస్సలు వాడుకోవడం లేదు. సినిమా ప్రమోషన్‌ పోస్టర్స్‌లో కానీ, ట్రెయిలర్‌లో కానీ ఎక్కడా సమంత కనిపించలేదు.

ఇది ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌ మాస్‌ సినిమా అనో, లేదా సీరియస్‌ సినిమా అనో ఇంప్రెషన్‌ వేయడానికి ట్రై చేస్తున్నారా లేక సినిమా విడుదలకి దగ్గర పడ్డాక సమంత అస్త్రాన్ని వాడుకుందామని అలాగే దాచి పెట్టి ఉంచారా అనేది తెలీదు. ఇది ఇలా ఉంటే ఈ చిత్రం విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదని దర్శకుడు దేవా కట్టా పేర్కొన్నాడు. వేరే సినిమాల విడుదల తేదీలు, ఇతరత్రా వెసులుబాట్లు చూసుకుని ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని, అంతదాకా ఈ సినిమా ఫలానా రోజున వస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనక్కర్లేదని దేవా కట్టా స్వయంగా చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు