సుకుమార్‌ పంతం, టెన్షన్‌లో నిర్మాతలు

సుకుమార్‌ పంతం, టెన్షన్‌లో నిర్మాతలు

రంగస్థలం సినిమా నిడివి మూడు గంటలు వుందనేది అభిమానులని కలవర పెడుతోంది. ఈ రోజుల్లో అంత నిడివి వున్న సినిమాలు అస్సలు రావడం లేదు. రెండున్నర గంటల పాటు వున్న చిత్రాలనే చాలా సాగదీసారని కామెంట్లు పడుతున్నాయి. దీంతో రెండు గంటల పది నిమిషాల లోపే సినిమా కానిచ్చేస్తున్నారు. ఆరు పాటల స్థానంలో నాలుగు పాటలే పెడుతున్నారు.

అలాంటిది రంగస్థలం చిత్రం మూడు గంటల నిడివి ఎందుకు? నిడివి తగ్గించాలని ఎంతమంది చెప్పినా సుకుమార్‌ వినలేదట. అతనికి చరణ్‌ నుంచి ఫుల్‌ సపోర్ట్‌ వుండడంతో అతని మాట కాదనడం ఎవరి వల్ల కాలేదట. దీంతో సుకుమార్‌ అనుకున్నట్టుగానే మూడు గంటల సినిమా రిలీజ్‌ అవుతోంది. దీంతో టాక్‌ ఏమి వస్తుందోనని నిర్మాతలు కంగారు పడుతున్నట్టు భోగట్టా. టాక్‌ ఏమాత్రం తేడా వచ్చినా కానీ ఇప్పటి రోజుల్లో ఇక అంతే సంగతులు. నిడివి ఎక్కువ వుందనే కారణంగా విమర్శలు వస్తాయేమోనని నిర్మాతలు భయపడుతున్నారట.

అసలే ద్వితియార్థం సీరియస్‌గా వుంటుందనే టాక్‌ కూడా వుంది. అంత సీరియస్‌ సినిమాకి ఇంత లెంగ్త్‌ అంటే ప్రేక్షకులు భారంగా ఫీలయ్యారంటే ఇబ్బందులు తప్పవు. చిరంజీవి సహా ఎవరి మాటా ఖాతరు చేయకుండా సుకుమార్‌ చేస్తోన్న ఈ సాహసం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది చూడాల్సిందే.